calender_icon.png 2 May, 2025 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి

02-05-2025 12:38:07 AM

నాగర్ కర్నూల్ మే 1 (విజయక్రాంతి)ఈత సరదా ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. ముక్కు పచ్చలారని చిన్నారులు చెరువు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన చూసిన మరికొంత మంది చిన్నారులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మండల కేంద్రానికి చెందిన అదేర్ల ధర్మారెడ్డి కుమారుడు అదేర్ల గణేష్(13)7వ తరగతి, కుమార్తె అదేర్ల రక్షిత(10) 5వ తరగతి (రంగారెడ్డి జిల్లాలో చదువుతున్నారు.) వనపర్తి జిల్లా పాన్ గల్ మండలం జమ్మాపూర్ గ్రామానికి చెందిన బండారు సుధాకర్ గౌడ్ రెండో కుమారుడు బండారు శ్రావణ్ కుమార్ (7) 2వ తరగతి. పెద్ద కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాడు.

గురువారం మధ్యాహ్నం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వెనుకాల ఉన్న పోతులోని చెరువులో సుమారు పదిమంది చిన్నారులు  ఈతకు వెళ్లారు. మొదట ఈ ముగ్గురు చిన్నారులు చెరువు నీటిలోకి ఒకరు తరువాత ఒకరు దిగారు.

చెరువు నీటిలో (కోపి గుంతలో) బురదలో మునిగిపోయారు. ఇది గమనించిన మరి కొంతమంది చిన్నారులు ప్రాణభయంతో పరుగులు పెట్టి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే స్థానికులు చెరువులోకి దిగి వారిని నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎంత పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.