02-05-2025 12:37:01 AM
నాగర్‌కర్నూల్, మే 1 (విజయక్రాంతి) /రేవల్లి: నీళ్లు, నిధులు, నియామకాల సాధనే లక్ష్యంగా ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ పదేళ్లపాటు తమ స్వార్థ ప్రయోజ నాల కోసం కృష్ణా నీటిని ఆంధ్రా రాష్ట్రానికి అమ్ముకున్నదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.
గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పాలమూరు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులను ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో కలిసి సందర్శించారు. ముందుగా పాలమూరు మొదటి లె ఫ్ట్ టన్నెల్, అప్రోచ్ కెనాల్, సంప్ హౌస్, పంప్ హౌస్, ఓపెన్ కెనాల్ పనులను పరిశీలించారు.
అక్కడి అధికారులను జరుగు తు న్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ పరిధిలోని కుమ్మెర గట్టు వద్ద పంప్ హౌస్ పరిశీలించారు. వనపర్తి జిల్లాలోని ఎదుల ఫేజ్ రిజర్వాయర్‌ను సందర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. పాలమూరు రిజర్వాయర్ పను లు త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఏటా కృష్ణ బేసిన్‌లో ఏర్పడే 811 టీఎంసీల నీటిని అత్యధిక ప్రాంతంగా హక్కుగా పొందాల్సిన తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే చాలు అం టూ గత ప్రభుత్వం లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినట్లు ఆరోపించారు. తద్వారా ఆంధ్ర రా ష్ట్రం ఏటా 512 టీఎంసీల నీటిని అక్రమంగా తోడుకుంటుందని మండిపడ్డారు. కృష్ణా నదిపై టెలిమెట్రీ పాయింట్స్ కూడా ఏర్పాటును పదేళ్లపాటు లెక్క లేకుండా కృష్ణ నీటిని ఆంధ్ర రాష్ట్రానికి బీఆర్‌ఎస్ అమ్ముకుందని ధ్వజమెత్తారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కృష్ణానది పరివాహకంలో ఆంధ్ర రాష్ట్రం ప్రాజెక్టులను అమాం తం రెండింతలు పెంచేస్తుందని అందుకు సంపూర్ణ సహకారం గత ప్రభుత్వం కల్పించిందన్నారు. పాలమూరు ప్రాజె క్టు నిర్మాణంలో రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి కూడా ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో నిర్మిస్తామని, మరో 10 నెలల్లో పాలమూరు ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామన్నారు. మరో రెండేళ్ల లోపు ఉదండాపూర్ వరకు పాలమూరు ప్రాజెక్టు ద్వారా కృష్ణ నీటిని మళ్లిస్తామన్నారు. కృష్ణ నీటి వాటా పెంపు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
కాళేశ్వరం పేరుతో..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు స్థానంలో కమీషన్ల కక్కుర్తి కోసం కాళేశ్వరం పేరుతో ప్రాజెక్టును నిర్మించి లక్ష కోట్లు అమాంతం మింగేశారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి ఖరీదైన లోన్లు తెచ్చారని అయినప్పటికీ నాసిరకమైన ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ప్రజల సొమ్మంతా గోదావరిలో పోశారని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో కమీషన్లు దండుకొని ఒక్క కుటుంబం మాత్రమే బాగుపడిందని మండిపడ్డారు. దాని స్థానంలో దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మించి ఉంటే సస్యశ్యామలం అయి ఉండేదన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యలు కొనసాగుతాయి
ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతాయని, జియోలాజికల్ నిపుణుల సూచన మేరకు సహాయక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. అత్యంత ఉత్తమ నిపుణుల సూచనలతో ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
వారి వెంట భారీ నీటిపారుద ల శాఖ ముఖ్య సలహాదారు పెంటారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎం పీ మల్లు రవి, ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్‌రెడ్డి, నారాయణరెడ్డి, కలెక్టర్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఎస్పీ గిరిధర్, ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ విజయ భాస్కర్‌రెడ్డి, ఆర్డీవో సుబ్రమణ్యం ఉన్నారు.