calender_icon.png 9 November, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు కోర్టు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

09-11-2025 12:00:00 AM

  1. లంచం తీసుకోవడమే కారణం!

మరో ముగ్గురిపై కొనసాగుత్ను విచారణ 

సిద్దిపేట సీపీ విజయ్‌కుమార్ దూకుడు

సిద్దిపేట, అక్టోబర్ 8 (విజయక్రాంతి): సిద్దిపేట పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ తనదైన శైలిలో పనిచేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఆరా తీస్తున్న కమిషనర్.. సొంత శాఖలోని ఉద్యోగులపై ప్రత్యేక దృష్టి సారించారు. దాంతో లంచం తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చిన ముగ్గురు కోర్టు కానిస్టేబుల్‌పై ప్రాథమిక విచారణ జరుపగా వాస్తవమని తేలింది.

దాంతో వారిని సీపీ విజయ్ కుమార్ శనివారం సస్పెండ్ చేశారు. వీరిలో విట్టల్ (జగదేవ్‌పూర్), కుమార్ (గజ్వేల్), సూరజ్ (బేగంపేట) ఉన్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వీరిలో ఒకరిద్దరిపై ఏసీబీ కేసు కూడా నమోదు చేయాల్సి వస్తుందని కమిషనర్ తెలిపారు. జిల్లాలో మరో ముగ్గురు పోలీసులపై విచారణ జరుగుతుందని వెల్లడించారు.