09-11-2025 12:00:00 AM
సూర్యాపేట జిల్లా సోమారంలో ఘటన
నేరేడుచర్ల, నవంబర్8 (విజయక్రాంతి): మూసీ నదిలో ఈతకు వెళ్లిన బాలిక గల్లంతైన ఘటన సూర్యాపేట జిల్లా మండల పరి ధిలోని సోమారం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం సోమారం గ్రామంలో గల సోమప్ప ఆలయం వెనుక భాగంలో మూసీ నదికి కోమరాజు సుస్మిత, అశ్వినీ దీక్షిత అనే ముగ్గురు బాలికలు ఈత కు వెళ్లారన్నారు.
వీరిలో సుస్మిత (13) నదిలోకి వెళ్లి కనిపించకుండా పోయిందన్నారు. మిగిలిన ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు గ్రామస్థు లు తెలిపారు. కాగా స్థానికులు పోలీసు లకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి నేరేడుచర్ల, పాలకీడు ఎస్‌ఐలు చేరుకుని గల్లంతైన బాలిక కోసం రెస్క్యూ టీమ్‌ను రం గంలోకి దింపారు.