09-11-2025 12:00:00 AM
అండర్ కబడ్డీ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థినులు
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఖమ్మం సౌత్ జోన్ క్రీడల్లో బాలికల విభాగం అండర్ కబడ్డీ పోటీల్లో ఖమ్మం శ్రీనివాస నగర్‌లో గల ఎస్వీఎం పాఠశాల విద్యార్థినులు ద్వితీయ స్థానంలో నిలిచి మెమొంటో, సిల్వర్ మెడల్స్ సాధించారు. శనివారం పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు డాక్టర్ కిషోర్, కొండా శ్రీధర్‌రావు, ఉమా కిషోర్ పాల్గొని విద్యార్థినులను అభినందించారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. ముఖ్యంగా బాలికలు తమ ఆత్మ రక్షణ కోసం క్రీడలు బాగా దోహదం చేస్తాయని చెప్పారు. విద్యార్థులు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో కూడా పాల్గొనే విధంగా పాఠశాలలో జరుగుతున్న అన్ని క్రీడల్లో పాల్గొని వాటిలోని మెళకువలను వ్యాయామ ఉపాధ్యాయులు ద్వారా తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎం ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.