ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు
- ఈ పొంగల్‌కు ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ మొదటి విడత
- అక్టోబర్ ౨ నుంచి మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత జర్నీ
- ప్రభుత్వ బస్సులతో పాటు ప్రైవేటు సర్వీసులకూ వర్తింపు
- తమిళనాడు సీఎం విజయ్
చెన్నై, ఆగస్టు 24: తమిళనాడు సీఎం సీ జోసెఫ్ విజయ్ సోమవారం అసెంబ్లీలో మహిళలకు, ట్రాన్స్‌జెండర్లకు, రైతులకు వరాల జల్లు కురి పించారు. ఆర్డినరీతోపాటు ఎక్స్‌ప్రెస్, డీలక్స్, లిమిటెడ్ స్టాప్, మోఫుసిల్ బస్సుల్లోనూ మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పి స్తున్నామని ప్రకటించారు. అక్టోబర్ 2 నుంచి ‘విజయయాత్ర’ పథకాన్ని ప్రారంభిస్తామ ని తెలిపారు. ఈ పథకం అమలు వల్ల ఏడాదికి రూ.6,000 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తేల్చిచెప్పారు.
ఎన్నికల హామీ అయిన ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’లో భాగంగా మొదటి విడుత 1.30కోట్ల మంది లబ్ధిదారులకు ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండ ర్లను అందజేయనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల ఏడాదికి సుమారు రూ.4,000 కోట్ల భారం పడనుందని చెప్పారు. ఈ పథకాన్ని 2027లో పొంగల్ పండుగకు ఆరంభిస్తామని స్పష్టం చేశారు. అలాగే పరంధూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానా శ్రయ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు కూడా విజయ్ ప్రకటించారు.
వ్యవసాయ భూముల ను, రైతల జీవనోపాధిని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేవారు. ఒక దేశ నిజమైన పురోగతి కేవలం ఆర్థిక వృద్ధి ద్వారానే కాకుండా, విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి రంగాల్లో మహిళలకు లభించే అవకాశాల ద్వారా కూడా కొలవబడుతుందని సీఎం విజయ్ స్పష్టం చేశారు. మహిళల స్వేచ్ఛా కదలిక (సంచార స్వేచ్ఛ) వారి ఆర్థిక స్వాతంత్య్రానికి, కుటుంబాల అభ్యున్నతికి పునాదిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
రూల్ 110 కింద సీఎం ఈ ప్రకటన చేశారు. అసెంబ్లీలో పలు కీలక ప్రకటనలు చేస్తూ, తన పార్టీ (టీవీకే) ప్రధాన ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు కృతనిశ్చయంతో కృషి చేస్తోందని విజయ్ అన్నారు. ‘వెట్రి పయనం’ (విజయ యాత్ర) పేరుతో చేపట్టే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని పొందడానికి మహిళలకు ఆదాయ పరిమితి లేదా ప్రయాణాల సంఖ్య వంటి ఎటువంటి షరతులు ఉండవని సీఎం విజయ్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం సాధారణ (ఆర్డినరీ) కేటగిరీ బస్సుల్లోనూ, అలాగే కొండ ప్రాంతాల్లో 40 కిలో మీటర్ల దూరం వరకు మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంది. సీఎం విజయ్ ప్రకటనతో మహిళలు, ట్రాన్స్‌జెం డర్లకు ఆర్డినరీతోపాటు డీలక్స్, ఎక్స్‌ప్రెస్, లిమిటెడ్ స్టాప్, మోఫుసిల్ (పట్టణాల మధ్య నడిచే) బస్సు సేవలు కూడా ఉచితంగా అందుబాటు లో రానున్నాయి. ‘ఏప్రిల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ చేసిన ప్రధాన సంక్షేమ హామీ అయిన ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పథకం (తమిళనాడులోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఏటా ఆరు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందజేత) గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు.
ఈ పథకం ప్రారంభంలో తొలి విడుతగా మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తా మని, వాటికి సంబంధించిన నగదు నేరుగా లబ్ధిదా రుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ఈపథకం వల్ల 1,30,16,104 కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. 2027 లో పొంగల్ పండుగ రోజున ఈ పథకాన్ని ప్రారంభిస్తామని, దీనికోసం ఏటా రూ.4,000 కోట్లు కేటాయి స్తామని విజయ్ పేర్కొన్నారు.
పరందూర్ రద్దు.. రాష్ట్రానికి ఆర్థిక నష్టం: డీఎంకే
పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టు రద్దు చేస్తామని సీఎం విజయ్ ప్రకటించడంతో ప్రతిపక్ష డీఎంకే మండిపడింది. ప్రభుత్వ నిర్ణయంపై డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా ఆగ్రహించారు. ఎయిర్‌పోర్టు స్థల మార్పు రాష్ట్రానికి ప్రతికూల ఆర్థిక నష్టాన్ని కలిగి స్తుందని తెలిపారు.
తమిళనాడు అభివృద్ధిని అనేక సంవత్సరాలు వెనక్కి నెట్టేస్తుందని విమర్శించారు. సీఎం నిర్ణయం రాష్ట్ర ప్రగతికి తిరిగి సరిదిద్దలేని ఎదురు దెబ్బగా స్టాలిన్ అభివర్ణించారు. విమానశ్రయ స్థల మార్పు తమిళనాడు రాజకీయాల్లో అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకేల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
పరందూర్ విమానాశ్రయం ప్రాజెక్టు రద్దు
ఒక కీలక విధానపరమైన మార్పులో భాగంగా, పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్ట్ నుంచి విరమించుకుంటు న్నామని, ఆ ప్రాజెక్ట్ కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తిస్తామని సీఎం విజయ్ ప్రకటించారు. ప్రజలకు అండగా నిలిచే టీవీకే ప్రభుత్వం, స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగించేలా విమానాశ్రయ నిర్మాణం జరగనివ్వదని తేల్చిచెప్పారు. అభివృద్ధికి ప్రభుత్వం వ్యతిరేకం కాదని పేర్కొన్న సీఎం.. చెన్నై రెండో విమానాశ్రయం కోసం ప్రత్యా మ్నాయ స్థలాన్ని చురుకుగా అన్వేషిస్తామని స్పష్టం చేశారు.
ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత లేని ప్రాంతాన్ని ఎంచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 2025 జనవరి 20న ఎన్నికలకు ముందు ఏకనాపు రంలో పర్యటించినప్పుడు, తమి ళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడిగా విజయ్ అక్కడి రైతులకు భరోసా ఇచ్చారు. తాను ఇచ్చిన హామీని సీఎం విజయ్ నిలబెట్టుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.






