02-07-2025 12:00:00 AM
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నీక్సన్
వనపర్తి, జులై 01 ( విజయక్రాంతి ) : జి.పి కార్మికుల మూ డు నెలల పెండింగ్ వేతనాలు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ డిమాండ్ చేశారు మంగళవా రం మదనపురం మండల కేం ద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంపీడీవో ప్రసన్నకుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే గ్రీన్ ఛానల్ ద్వారా జీపీ కార్మికులకు ఏప్రిల్ నుండి వేతనాలను విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అయినా నేటికీ ఏప్రిల్ మే నెల జూన్ మూడు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము పెండింగ్ వేతనాలు విడుదల చేసి జిపి కార్మికులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిపి కార్మికులు మధు నాగన్న అశోకు ఖాదరు శ్రీనివాసులు రమేష్ దస్తగిరి బక్క శ్రీను సహదేవుడు తిరుపతయ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.