02-07-2025 12:00:00 AM
- కలెక్టర్‌కు విన్నవించిన దళిత సంఘాల నేతలు
మహబూబ్ నగర్ రూరల్ జూలై 1: గత మూడు తరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దళితుల భూముల ను అధికారులు లాకుంటే ఎలా అని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షులుమల్లెపోగు శ్రీనివాస్ అన్నారు. సర్వేనెంబర్ 431 దాదాపు 20 ఎకరాలకు పైగా భూ మిని 20 కుటుంబాలు మూడు తరాలుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాయని తెలిపారు.
భూమి అక్కడ పెద్ద గుట్ట ఉంటే ఆ యొక్క గుట్టను సాగు చేసి వ్యవసాయానికి అ నుకూలంగా తయారు చేసే మూడు తరాలుగా మా తాత ముత్తాతలు వ్యవసాయం చేస్తుంటే గత సంవత్సరం కింద ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని ఎక్కడ అగ్రికల్చర్ వ్యవసాయం చెయ్యనివ్వకుండా బెదిరింపులకు గురిచేసి మా ఆధీనంలో ఉన్న భూమిని లాక్కొని అక్కడ చెట్లు నాటడం జరిగిందన్నారు. అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు.