చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు వైద్యులు, లాయర్ మృతి
కర్ణాటక: ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న బళ్లారి జిల్లాలో ఆదివారం ఉదయం కారు చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో వ్యక్తికి గాయాలైనట్లు వారు తెలిపారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం మీదుగా బళ్లారికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు డ్రైవర్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. బళ్లారి జిల్లాలోని చెల్లగుర్కి గ్రామం- ఆంధ్రప్రదేశ్‌లోని విడపనకల్ గ్రామం మధ్య జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు వైద్యులు, ఒక లాయర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.




