06-02-2026 01:18:15 AM
సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 5 : సిద్దిపేట పట్టణంలోని ఇటీవల చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నలుగురు పట్టుబడ్డారని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం వారిని కోర్టులో హాజరుపరిచినట్టు పేర్కొన్నారు.
స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు ముగ్గురికి కలిపి రూ. 31వేల జరిమానా, ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారని చెప్పారు. డ్రైవింగ్ లై సెన్స్ లేకుండా వాహనం నడిపిన ఒకరికి రూ. 5వేల జరిమానా విధించారని సీఐ ప్ర వీణ్ కుమార్ తెలిపారు.