06-02-2026 01:19:24 AM
సంగారెడ్డి ఫిబ్రవరి 5 : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్ ప్ర క్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రా వీణ్య, జనరల్ అబ్జర్వర్ ఉదయ్ కుమార్ సమక్షంలో గురువారం నిర్వహించారు. కలెక్టర్ ఛాంబర్ లో ఎన్నికల సంఘం నిబంధన లను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు. ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశి తంగా పరిశీలించారు.
ఎన్నికలు నిర్వహించా ల్సి ఉన్న సంగారెడ్డి, సదాశివపేట, కోహిర్, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ - జోగిపేట్, ఇస్నాపూర్, ఇంద్రేశం, గుమ్మడిదల, గడ్డపోతారం, జిన్నారంమున్సిపాలి టీ లకు సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఈ కార్యక్ర మంలో అడిషనల్ కలెక్టర్ పాండు, డిఇఓ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.