సాఫ్ట్‌వేర్ ఆత్మహత్య కేసు.. భార్య, అత్త, బామ్మర్ది అరెస్ట్
15-12-2024 12:58 PM
కర్నాటక: బెంగళూరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో తన భార్య నిఖిత తల్లి నిషా, సోదరుడు అనురాగ్ సింఘానియాను అరెస్ట్ చేశారు. వారిని గురుగ్రామ్ లో పోలీసులు అతుపులోకి తీసుకున్నారు. భార్య ఆమె కుటుంబసభ్యుల వేధింపుల కారణంగా అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారణ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితులను కోర్టులో హాజరుపరచగా, వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అతుల్ మామ ప్రస్తుతం పరారీలో ఉన్నారని అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. డిసెంబర్ 9న లేఖ రాజి టెకీ అతుల్ సుభాస్ ప్రాణాలు తీసుకున్నాడు. భార్య కుటుంబసభ్యులు వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు.






