calender_icon.png 5 August, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు పార్టీల మూడు స్తంభాలాట

26-07-2025 12:00:00 AM

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటుతున్నా వెనుకబడిన వర్గాల (బీసీలు) ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు మారలేదనేది నిర్వివాదాంశం. బీసీలకు రాజ్యాంగపరమైన రక్షణ కూడా లేదనేది వాస్తవం. అం దుకు కారణం ఆర్టికల్ 340లో వారిని వె నుకబడిన వర్గాలని పేర్కొనడమే. క్లాసెస్‌కు బదులుగా క్యాస్ట్స్ (కులాలు) అని ఉం టే గుర్తింపు ఉండేది. ఇప్పటివరకు ప్రభుత్వాలు బీసీలపై ఉదారత చూపించకుండా మోసం చేస్తూ వస్తున్నాయి.

బీసీల పోరా టం వల్ల ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ, రెండు వేర్వేరు బిల్లులను శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి న్యాయసమీక్షకు లోనుకాకుం డా రాజ్యాంగ రక్షణ కల్పించమని, ఆ బి ల్లును కేంద్రానికి పంపించింది. ప్రస్తుతం బిల్లు రాష్ట్రపతి టేబుల్ వద్ద పెండింగ్‌లో ఉంది.

అప్పటినుంచి బీసీల రిజర్వేషన్ల వి షయంలో రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మూ డు స్తంభాలాట ఆడుతున్నాయి. సెప్టెంబర్30 లోపు స్థానికసంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చి, రాష్ట్ర ప్రభుత్వానికి విషమ పరీక్ష పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకు అ నుగుణంగా రాష్ట్రప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను రూపొందించి గవర్నర్ జిష్ణుదేవ్ వ ర్మ ఆమోదానికి పంపింది.

ఈ క్రమంలో మూడు పార్టీల వాదనలను గమనించాల్సిన అవసరం బీసీలకు ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ర్టలో ముస్లిం రిజర్వేషన్లు అమ లు చేస్తున్నారని, తాము మతప్రాతిపదికన కాకుండా కులం ఆధారంగా రిజర్వేషన్లు అ మలు చేస్తున్నామని బీజేపీ చేసిన విమర్శను తిప్పికొడుతూ ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి ఢిల్లీలో వివరణ ఇచ్చారు.

అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీల విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన తప్ప నిసరి పరిస్థితి రావడంతో బీసీ కమిషన్‌ను నియమించింది. కమిషన్ ద్వారా రాష్ర్టం లో కులగణన చేయాలని చూసింది. బీసీల సమస్యలపై ప్రత్యేకించి రిజర్వేషన్లపై ప్రజల నుంచి అభిప్రాయాలను, విజ్ఞప్తులను స్వీకరించేందుకు కమిషన్ చైర్మన్, సభ్యులు ఉమ్మడి పది జిల్లాల పర్యటన చేపట్టారు.

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లాకేంద్రానికి వచ్చినప్పుడు డెడికేషన్ కమిషన్ వేసి దాని ద్వారా మాత్రమే కులగణన చే యాలని, హైకోర్టు మార్గదర్శకాలకనుగుణంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడ మైంది.

అదేరోజు సాయంత్రం డెడికేషన్ కమిషన్ వేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తర్వాత కులగణన ప్రక్రియ పూర్తయింది. చివరగా రాష్ట్రంలో బీసీలు 46 శాతం ఉన్నారని, దానికి మైనారిటీ బీసీలు 10 శాతం కలిపితే, మొత్తం 56 శాతం బీసీలు ఉంటారనే ప్రకటన వచ్చిం ది. ఇదంతా ఒక ప్రహసనంగానే ఎంతోమందికి అనిపించింది.   

‘కాంగ్రెస్’ హామీలు.. నీటిమూటలు..

కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనేక వాగ్దానాలు చేస్తూ ఎన్నికలకు ముందే కామా రెడ్డి డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఈ రిజర్వేషన్లు కాకుండా కామారెడ్డి డిక్లరేషన్‌లో ఆ పార్టీ ఉద్యోగాల కల్పన, సబ్ ప్లాన్, మండలాల్లో అర్హులకు షాపుల కేటాయింపు, అ నేక బీసీ కార్పొరేషన్లు, ప్రతి జిల్లా కేంద్రం లో జయశంకర్ సార్ పేరుపై నాలెడ్జ్ సెం టర్, సబ్సిడీ రుణాలు.. ఇలా ఎన్నో హామీ లు ఇచ్చింది.

వాటిని నమ్మి బీసీలందతా కాంగ్రెస్‌కు జైకొట్టారు.  ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సామాజిక న్యాయం నినాదానికి ఆకర్షితులై ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక, అధిష్ఠానం మంత్రివర్గంలో కేవలం ముగ్గు రు బీసీలకు అవకాశమిచ్చింది. ఇది ఏ వి ధంగా సమర్థనీయమో, ఎలాంటి సామాజిక న్యాయమో బీసీలు గమనిస్తూనే ఉన్నారు. 

బీసీలకు బీఆర్‌ఎస్ అన్యాయం..

వరుసగా రెండు దఫాలుగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. పదేళ్లలో పాటు రాష్ట్రంలో కుటుంబపాలన సాగించారు. రాష్ట్రంలో సగానికి పైగా జనా భా ఉన్న బీసీల నోట్లో మట్టికొట్టారు. రాష్ట్రక్యాబినెట్, చట్టసభలు, నీటిపారుదల, పోలీస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ శాఖలు, ఉన్నత స్థాయి నామినేటెడ్ పదవులను తనకు నచ్చిన వ్యక్తులు, తన సామాజికవర్గానికి చెందిన బంధువులతో నింపేశారు. బీసీల పట్ల వివక్ష చూపడమే కాకుండా, ఆ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులనూ ఘోరంగా అవమానాలకు గురిచేశారు.

వారిలో కొందరిపై కక్ష సాధింపులకు పాల్పడ్డారు. అంతకుముందు ప్ర భుత్వం కల్పించిన 34 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లను, బీఆర్‌ఎస్ ప్రభుత్వం దుర్మార్గంగా 23 శాతానికి తగ్గించిన విషయాన్ని బీసీలు గుర్తుంచుకునే ఉన్నారు. అందుకే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు బీఆర్‌ఎస్‌నుపక్కన పెట్టారు. ఒకవేళ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోకపోయి ఉంటే, ఇప్పటికే పార్టీ పెద్దలు రాష్ట్రంలో విద్యారంగాన్ని, వైద్యరంగాన్ని, ప్రభుత్వ రంగ సం స్థలన్నింటినీ తెగనమ్మి దోచుకునేవారు. తమ సన్నిహితులకు పప్పూ బెల్లాల్లా పం చిపెట్టేవారు.

దీన్ని ఊహించిన బీసీ ప్రజ లు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు కర్రు కాల్చి వా త పెట్టారు. టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్)కు అం దరం యజమానులమే అన్న పాపానికి ఓ బీసీ నాయకునికి ఆ పార్టీలో ఏ గతి ప ట్టిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇదం తా బీఆర్‌ఎస్‌లో ఉన్న బీసీ నాయకులు మర్చిపోయినట్టున్నారు. ప్రజలు మాత్రం ఇంకా మరచిపోలేదు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్ నాయకులు రకర కాల నాటకాలకు తెరలేపారు.

అందులో భాగంగా ఎమ్మెల్సీ కవిత బీసీలకు న్యా యం జరగాలని, తానే న్యాయం చేస్తానని పూలే యునైటెడ్ ఫ్రంట్ పేరుతో గగ్గోలు పెడుతున్నారు. మరి బీఆర్‌ఎస్ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయం గురించి పల్లెత్తు మాట ఎందుకు అనడం లేదు. ఇది అర్థం చేసుకోలేని అమాయకపు బీసీ ప్రజలు కొద్దిమంది వారి వెంట తిరుగుతున్నారు. మెజారిటీ బీసీలు వారిని నమ్మడం లేదని గుర్తుంచుకోవాలి. 

బీజేపీలో అగ్రకులాలకు అందలం..

తాము అధికారంలోకి వస్తే బీసీనే సీఎం అని ఎన్నికల ముందు నినాదమిచ్చిన బీజేపీ, ఆ తర్వాత బీసీ నాయకుణ్ణి అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. పార్టీ మరో అనుభవజ్ఞుడైన బీసీ నాయకుణ్ణి పదవిలో నియమిస్తుందని అందరూ ఊహిం చారు. అందుకు విరుద్ధంగా పార్టీ అగ్రకులానికి చెందిన నేతను ఆ పదవిలో కూర్చోబెట్టింది. దీంతో బీజేపీకి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక ల్లో ఆశించిన మేర సీట్లు రాలేదు.

పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ కొంత పైచేయి సాధించింది. ఈ రకంగా బీసీ నినాదం ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి, రెండో స్థానంలో బీజేపీకి ఉపయోగపడి, మోసం చేసిన బీఆర్‌ఎస్‌కు పూర్తి వ్యతిరేకంగా పనిచేసింది. బీజేపీకి ఎక్కువగా మద్దతిచ్చేది మధ్యతరగతి ప్రజలైన బీసీలేననేది మరచిపోకూడదు. ఆ పార్టీ మళ్లీ ఈ మధ్యనే ఓ అగ్రకులానికి చెందిన నేతలను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించుకుని రాజకీయం చేస్తున్నది.

రాష్ట్రప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చకుండా రాజకీయ డ్రామాలు ఆడుతున్న విషయా న్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందులోని నాయకులు తలా ఒక మాట మాట్లాడుతున్నారు. బీజేపీ కేంద్రమంత్రి ఒకరు బిల్లుల్లో పేర్కొనని విషయాన్ని లేవనెత్తి అభాసుపాలవుతున్నారు. ఎవరెన్ని మాటలు చెప్పినా బీసీల రిజర్వేషన్ల బిల్లుల భవితవ్యం వారి చేతుల్లోనే ఉందనేది నూటికి నూరు శాతం నిజం.

స్వాతంత్య్రం అనంతరం అగ్రకుల పెట్టుబడిదారులు రాజకీయాల్లోకి వచ్చి, ప్రజలను సంక్షేమ పథకాల పేరుతో బిచ్చగాళ్లుగా మార్చి, పెద్దఎత్తున ప్రజా సంపదను దోపిడీ చేశారు. అధికారంలో ఉన్న వారికి మాత్రమే రాజ్యాంగం ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దారు. అందరూ సమానమే అని పేర్కొంటూనే, డబ్బులు లేకుండా రాజకీయం చేయలేని దుస్థితిని సృష్టించారు.

ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్న, మోసపోయిన బీసీ ప్రజానీకం దీన్ని ఎదుర్కొనేందుకు సహకార రాజకీయం నడపాల్సిన చారిత్రక అవసరం వచ్చింది. అంటే ప్రజలందరూ కలిసికట్టుగా తమ శక్తి మేరకు ఖర్చు చేసి, ఎవరిని డబ్బులు అడగకుండా రాజకీయం చేస్తేనే, ఇకమీదట నీతివంతమైన రాజకీయాలు చేయగలం. 

వ్యాసకర్త సెల్  01645