27-07-2025 12:00:00 AM
రైల్వే సిగ్నల్, టెలికాం ఉద్యోగుల భద్రతకు భరోసా లేకుండాపోయింది. కార్మికులు నిర్మించే ఇంటర్‌లాకింగ్ సర్క్యూట్‌లు ఎం తో సంక్లిష్టమైనవి. అంతే ప్రమాదకరమైనవి.రెండు విభాగాల్లో ఉ ద్యోగంలో చేరే వారికి ప్రభుత్వాలు కనీసం ఒకటిన్నర సంవత్సరం శిక్షణ ఇవ్వాలి. అంది కూడా చాలా పక్కాగా ఉండాలి. ఉద్యోగి అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఉండాలి. ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను అర్థం చేసుకోవడం అంతా సులభమేమీ కాదు. ప్రతి రిలే రూంలో లక్షలాదిగా వైర్లు, విద్యుత్ కనెక్షన్లు ఉంటాయి.
ఉద్యోగి ఒక్క చిన్న తప్పు చేసినా, తనతోపాటు అక్కడ పనిచేసే వారంతా ఎక్కువ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ట్రాక్ యంత్రాలను నిర్వహించే ప్రతి గ్యాంగ్‌లో సిగ్నల్, టెలికాం విభాగం నుంచి ఒక కార్మికుడు ఉండాలని నిబంధనలు ఉన్నాయి. అయితే.. ఖాళీ అవుతున్న పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్తగా రిక్రూట్ అయ్యేవారు లేకపోవడంతో, ఇక ఉన్నవారితోనే పైఅధికారులు ఎక్కువ పని గంటలు పనిచేయిస్తున్నారు. ఉద్యోగులు ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేనిచోట పనిచేస్తున్నారు. వారికి అధికారులు తగినంత విశ్రాంతి కూడా ఇవ్వడం లేదు. రైల్వే ఉద్యోగులు, టెలికాం ఉద్యోగులు ఈ సమస్యలన్నింటినీ సర్వ సాధారణంగా ఎదుర్కొంటారు.
ఫలితంగా కార్మికులు చిన్న వయసులోనే కొందరు మధుమేహం, రక్తపోటు బారిన పడుతున్నారు. నెలకు వేలాది రూపాయలు వెచ్చించి మెడిసిన్ వాడుతున్నార. ఒత్తిడి ఎక్కువైన కార్మికులు కొం దరు గుండెపోటుకు, బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన సందర్భాలు ఉన్నా యి. అంతేగాక, వీరు విధులు ముగించుకుని ఇంటికి వచ్చాక శారీరక అలసటతో కుటుంబానికి సమయం కేటాయించలేకపో తున్నారు. తద్వారా కుటుంబంపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. ముఖ్యంగా రైల్వే సిగ్నలింగ్ ఉద్యోగం ప్రయాణికుల భద్ర తకు సంబంధించింది. ఈ రంగంలో ఖాళీ అవుతున్న ఉద్యోగాలను రైల్వేశాఖ ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. లేకపోతే ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈశాన్య రైల్వే జోన్‌లో ఒకప్పుడు ఒకే లైన్ మాత్రమే ఉండేది.
ఈ రూట్‌లో సుమారు 45,000 మంది కార్మికులు పనిచేసేవారు. ఇప్పుడు అధిక లైన్లను విస్తరించడంతో ఉద్యోగుల సంఖ్య 41,000 మంది తగ్గింది. ఉన్నవారిపై ఎక్కువ పనిభారం పడుతున్నది. ట్రాక్‌లపై పని చేయాల్సిన వారందరితో పాటు ఇందులో సిగ్నల్, టెలికాం ట్రాక్ మెయింటెనర్లు సిబ్బందికీ రైల్వేశాఖ రక్షణ పరికరాలు ఇవ్వాలి. కానీ, ఆ పరికరాలు ఇవ్వడం లేదు. అలాగే యేటికేడు రైళ్ల సంఖ్య రెట్టింపు అవుతున్నా, రైల్వేశాఖ రైలు కంట్రోలర్ సిబ్బందిని కేవలం 8శాతం మాత్రమే పెంచింది. సాధారణంగా దేశవ్యాప్తంగా 70,000 మంది విధులు నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం 65,000 మంది మాత్రమే ఉన్నారు. రైల్వే సిబ్బంది చలి, కుండపోత వర్షాన్ని, మండుతున్న ఎండలను లెక్కచేయకుండా పనిచేయాల్సి వస్తున్నది. రైల్వేశాఖ అధికారులు ప్రయాణికుల భద్రతతో పాటు ఉద్యోగుల సంక్షేమంపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఆళవందార్ వేణు మాధవ్, హైదరాబాద్