తల్లి శవం వద్ద రాత్రంతా మూడేళ్ల చిన్నారి రోధన
భర్త చెతిలో మహిళ దారుణ హత్య
వివాహేతర సంబంధయే కారణం?
షాద్‌నగర్(విజయక్రాంతి): ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వివాదంలో మహిళ దారుణ హత్య గురైంది. స్థానికుల కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం దేవునిపల్లి గ్రామపంచాయతీ రంగారెడ్డిగూడకు చెందిన పోతుల శోభారాణి (30) వివాహం మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ గ్రామానికి చెందిన రాజుతో పదేండ్ల క్రితం జరిగింది. వీరి వైవాహిక జీవితం కొన్నేండ్ల పాటు సాఫీగా సాగింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన నర్సింహులుతో శోభారాణికి వివాహేతర సంబంధం ఏర్పడింది.
విషయం భర్తకు తెలిసి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నెలరోజుల క్రితం శోభారాణి భర్త రాజును వదిలేసి పిల్లలతో కలిసి తల్లిగారింటికి వచ్చింది. అప్పటి నుంచి నర్సింహులు శోభారాణిని పెళ్లి చేసుకుంటానని కుల పెద్దలతో భర్తతో మాట్లాడాడు. దీంతో ఆగ్రహానికి గురైన భర్త రాజు శోభారాణిని శనివారం రాత్రి అత్యంత దారుణంగా చంపి రంగారెడ్డిగూడ- తంగడపల్లి రహదారిలో చెట్ల పొదల్లో పడేశాడు.
ఆదివారం ఉదయం పొలానికి వెళ్లిన రైతు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడేళ్ల చిన్నారి తల్లి శవం వద్ద రాత్రంతా రోదిస్తూ గడపడం చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతము య్యారు. ఈ సమాచారం అందుకున్న షాద్నగర్ ఇన్స్పెక్టర్ సీతారాం , ఎస్సై సుశీల సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




