టూరిజం విలేజ్ నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
22-03-2026 04:35 PM
రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క
ములుగు,మార్చి22(విజయక్రాంతి): ములుగు మండలం ఇంచర్ల గట్టమ్మ వద్ద పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రామప్ప ప్రాంత సుస్థిర పర్యాటక సర్క్యూట్ లో భాగంగా నిర్మిస్తున్న టూరిజం విలేజ్ నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ టూరిజం విలేజ్ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా నాణ్యత ప్రమాణాల విషయంలో నిరంతరం అధికారులు తనిఖీ చేస్తూ పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అభివృద్ధి నిర్మాణ పనులలో గుత్తేదారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.




