8 April, 2026 | 9:31 AM

ఆవుపై పులి దాడి

08-12-2024 12:33 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా లో గత కొంత కాలంగా జరుగుతున్న పులిదాడులతో ప్రజలు, రైతులు భయందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఆసిఫాబాద్ మండలంలోని గంటలగూడ గ్రామ సమీపంలో ఆవుపై దాడిచేసి చంపేసిం ది. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలిం చి పులి దాడి చేసినట్లు నిర్ధారించారు. బాధిత రైతు రాములుకు తక్షణ సహా యం కింద రూ.5 వేలు అందజేశారు. అటవీ ప్రాంతంలోని సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పులి జాడను తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.