10 May, 2026 | 11:45 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

వెంకటాపూర్‌లో పులి సంచారం

11-12-2024 01:31 AM
  • అడుగులను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు
  • పులి గాండ్రింపులతో జంకిన రైతులు

ములుగు(జనగామ), డిసెంబర్ 10 (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని అలువాక బోధపురం ప్రాంతంలోని గోదావరి పాయలో మంగళవారం పెద్దపులి అడుగులు కనిపించడం కలకలం రేపింది. ఆలువాక బోధపురం గోదావరి తీర ప్రాంతంలో పచ్చని పంటలు సాగవుతున్నాయి. సోమవారం రాత్రి ఈ పంటల వద్ద నిద్రించిన కొందరు రైతులకు పులి గాండ్రింపులు వినిపించాయి.

మరుసటి రోజు మంగళవారం ఉదయం గోదావరి తీర ప్రాంతం లో పెద్ద పులి అడుగులను గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అడుగులను పరిశీలించిన అధికారులు పెద్ద పులివేనని నిర్ధారించారు. గతంలోనూ ములుగు, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో పెద్దపులి సంచరించి పలు పశువులపై దాడి చేసింది.

మళ్లీ పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలియడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అలువాక బోధపురం ప్రాంతం నుంచి పెద్ద పులి ఎటు వెళ్లిం దో తెలుసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అటవీ ప్రాంత రైతులు పశువుల మేత కోసం అటవీ లోపలి ప్రాంతంలోకి వెళ్లొద్దని, పులి జాడ కనిపిస్తే దాడి చేయవద్దని, తమకు సమాచారం ఇవ్వాలని అటవీ అధికారులు కోరారు.