19-05-2025 08:30:28 PM
రేపు ఎలిగేడు మండలం ముప్పిరి తోటలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు..
ముప్పిరి తోట రెవెన్యూ సదస్సు సభాస్థల పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష..
పెద్దపల్లి (విజయక్రాంతి): ఎలిగేడు మండలం ముప్పిరి తోటలో జరిగే మంత్రుల పర్యటన విజయవంతం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sri Harsha) సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామాన్ని జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి పరిశీలించి మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ... మే 20న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామంలో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం-2025 రెవెన్యూ సదస్సు అవగాహన కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొంటారని, మంత్రులు పాల్గొనే భూ భారతి చట్టం-2025 అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని, ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకొని అవసరమైన మేర టెంట్, కుర్చిలు, కూలర్ లు వంటి సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, ఎలిగేడు తహసీల్దార్ బషీరుద్దిన్, ఎంపిడిఓ భాస్కర్ రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.