calender_icon.png 15 July, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

15-07-2025 12:00:00 AM

కొల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

కొల్లాపూర్ జూలై 14: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు భూమి పూజతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం సోమవారం భారీ ఏర్పాట్లను చేపట్టింది.

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయకత్వంలో జిల్లా స్థాయి అధికారులు, విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయి. పెంటవెల్లి మం డలంలోని జటప్రోలు గ్రామంలో నిర్వహించనున్న బహిరంగ సభ స్థలాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించి,

హెలిప్యాడ్, సభా వేదిక, వీఐపీ లాంజ్, ప్రజలకు అవసరమైన వసతులు తదితర అంశాలపై సూచనలు, మార్గదర్శకాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు.