15-07-2025 12:00:00 AM
గద్వాల టౌన్, జూలై 14 : గద్వాల జిల్లాలోని దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ పరిశీలనకు హాజరు కావాల్సిందిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి సునంద సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 15, 16 తేదీలలో ఐ.డి.ఓ.సి భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించబడుతుందని జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు.
ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం, విద్య ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్, నిరుద్యోగం అఫిడివిటీ అన్ని సర్టిఫికెట్స్ ఒక సెట్ జిరాక్స్ తో హాజరు కావాలని సూచించారు.దివ్యాంగులకు సబ్సిడి లోన్స్ అన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణజిల్లా దివ్యాంగులకు 2025-2026 సంవత్సరము ఆర్థిక పునరావాస పథకం ద్వారా స్వయం ఉపాది.,
చేతివృత్తులు, కుటిర పరిశ్రమలు పెట్టుకొనుటకు గాను, మండలానికి, మున్సిపాలిటీకి ఒక్కటి చొప్పున రూ.50,000/-లు నాన్ బ్యాంక్ లింకేజి క్రింద మరియు జిల్లాకి ఒక్క బ్యాంక్ లింకేజి యూనిట్ కొరకు ఆన్ లైన్ ద్వారా ఈనెల 14 నుండి 31వ తేదీ వరకు ధరఖాస్తులను స్వీకరించబడునని బి డబ్ల్యు ఓ సునంద సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి గల దివ్యాంగులు మీ సేవ ద్వారా https. tgobmms.cgg.gov.in వెబ్ సైట్ నందు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకై జిల్లా సంక్షేమ అధికారిణి, మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ G-33 కలెక్టర్ కార్యాలయం జోగులాంబ గద్వాల్ లో, అన్ని కార్యాలయ పని వేలలలో సంప్రదించగలరు.