calender_icon.png 11 February, 2026 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

11-02-2026 12:10:54 AM

ఎస్పీ మహేష్ బి.గితే. ఐపీఎస్ 

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): సిరిసిల్ల,వేములవాడ మున్సిపల్ పరిధిలో జరుగు ఎన్నికల నేపధ్యంలో ప్రజలు స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునెల,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 800 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ.సిరిసిల్ల,వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లలో ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్ అధికారులకు , సిబ్బందికి ఎన్నికల విధులపై జిల్లా ఎస్పీ దిశ నిర్ధేశం చేశారు.

ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో రూట్ మొబైల్స్: 17 జోనల్ టీమ్స్ : 06 ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో, రిసర్వ్ టీమ్స్ : 04 ,స్ట్రయికింగ్ ఫోర్స్ : 02 , స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్ : 02 , ఏర్పాటు చేసి మొత్తం 800 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రాలను వదిలి వెళ్లరాదని,రూట్ మొబైల్ అధికారులు తమకు కేటాయించిన రూట్లలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని,పోలింగ్ కేంద్రాల వద్ద,రూట్లలో ఎన్నికల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే చిన్న సంఘటన ఎదురైన వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.

పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, మందుగుండు సామగ్రి, ఇంక్ బాటిళ్లు, వాటర్ బాటిళ్లు తీసుకువెళ్లడం నిషేధమని, పోలింగ్ బూత్లో సెల్ఫీలు దిగడంపై పూర్తిగా నిషేధం ఉంటుందని తెలిపారు.ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో 163 బి ఎన్ ఎస్ ఎస్ 144 సెక్షన్ అమలులో ఉంటుందని,

ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఆంక్షలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని,ఎన్నికల నియమాలను అతిక్రమిస్తే చట్టపరమైన తీసుకుంటాని తెలిపారు.ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరికీ బాధ్యత అన్నారు.వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ నాగేంద్రచాలరి,ఇన్స్పెక్టర్ లు,ఆర్.ఐ లు,ఎస్.ఐ లు , పోలీస్ సిబ్బంది ఉన్నారు.