11-02-2026 12:12:47 AM
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్క రూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్పూర్తిని చాటాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ కుమార్ ప్రజలకు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక శా తం పోలింగ్ జరిగిన పార్లమెంట్ గా కరీంనగర్ ను అగ్రస్థానంలో నిలపాలని కోరా రు.
దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం నిజాయితీగా పనిచేసే అభ్యర్థులకే ఓటేసి ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టాలని అభ్యర్ధించారు. మీరు వేసే ఓటు మన కార్పొరేషన్, మన మున్సిపాలిటీల అభివ్రుద్ధికి దోహదం చేయాలని ఆకాంక్షించారు. మీరు వేసే ఓటు అవినీతిపరుల, అరాచక వాదుల, భూకబ్జా దారుల పాలిట అంకుశంగా మారాలని పేర్కొన్నారు.