సీఎం పర్యటనకు 1,406 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
05-06-2026 01:30 AM
జడ్చర్ల, జూన్ 4: జిల్లా పర్యటన నేపథ్యంలో 1,406 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కరువేనా, ఉదండపూర్ రిజర్వాయర్లు, జడ్చర్లలోని హెలిప్యాడ్, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఏఎస్‌ఆర్ గార్డెన్ లో నిర్వహించిన బ్రీఫింగ్లో అధికారులకు జిల్లా ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం చేశారు. అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. బందోబస్తులో 3 ఎస్పీలు, 16 డీఎస్పీలు, సీఐలు 43, 94 ఎస్‌ఐలు పాల్గొంటున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్పీ తెలిపారు






