5 June, 2026 | 2:43 AM

లక్ష్మీదేవునిపల్లిలో ప్రత్యేక గ్రామసభ

05-06-2026 01:30 AM

భిక్కనూర్, జూన్ 4(విజయ క్రాంతి): ప్రజా పాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా భిక్కనూర్ మండలంలోని లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో ఆర్‌ఐ నజీముద్దీన్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాల సన్నద్ధత, పారిశుద్ధ్యం, తాగునీటి నిర్వహణ, మొక్కల పెంపకం, ఓటరు జాబితా సవరణ తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ లింగారెడ్డి, గ్రామ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.