తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్
- దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్
- నార్త్ జోన్‌పై ఘన విజయం
- రెండు ఇన్నింగ్స్‌లలో అదరగొట్టిన తిలక్
- ఈస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య టైటిల్ పోరు
బెంగళూరు, సెప్టెంబర్ 2 : హైదరాబాదీ క్రికెటర్(Hyderabad cricketer) తిలక్ వర్మ(Tilak Varma) దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో అదరగొడుతున్నాడు. సౌత్ జోన్ జట్టుకు సారథి గా వ్యవహరిస్తున్న తిలక్ వర్మ అధ్బుతమైన బ్యాటింగ్(batting)తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. తొ లి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సౌత్ జోన్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తిలక్ వర్మ బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో సౌత్ జోన్ 7 వికెట్ల తేడాతో నార్త్ జో న్‌ను ఓడించింది.
256/7 ఓవర్‌నైట్ స్కోర్(overnight score) తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన నార్త్ జోన్ రెండో ఇన్నింగ్స్ 297 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్‌కు 41 పరుగు లు మాత్రమే జోడించి చివరి మూడు వికె ట్లు కోల్పోయింది. సనత్ సంగ్వాన్ (76), ఆ యుష్ డోసెజా(52) హాఫ్ సెంచరీలో రా ణించారు. ఓవర్‌నైట్ బ్యాటర్ అన్షుల్ కాం బోజ్ 36 పరుగులే చేశాడు. సౌత్ జోన్ బౌలర్లలో నిదీష్ ఐదు వికెట్లతో సత్తా చాట గా.. కావురి సాయితేజ, శ్రేయాస్ గోపాల్ తలో రెండో వికెట్లు పడగొట్టారు.
తొలి ఇ న్నింగ్స్‌లో సౌత్ జోన్‌కు 117 పరుగుల ఆధి క్యం దక్కడంతో లక్ష్యం 182 పరుగులే అ య్యింది. సౌత్ జోన్ 43.1 ఓవర్లలో 3 వికెట్లకు 182 పరుగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మ (79 బంతుల్లో 8 ఫోర్లతో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. రవిచంద్రన్ స్మరణ్ (32 నాటౌట్), నారాయణ జగదీషన్ (43), రికీ భూయ్ (42) పర్వాలేదనిపించారు.
నార్త్ జోన్ బౌలర్లలో అబిద్ ముస్తాక్ రెండు వికెట్లు తీయ గా.. గుర్నూర్ బ్రార్ ఒక వికెట్ పడగొట్టాడు. కెప్టెన్ తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్‌తో సౌత్‌జోన్ తలపడుతుంది.






