కోల్‌కతా బోణీ కొట్టేనా?
- చెపాక్‌లో చెన్నైతో మ్యాచ్
ఢిల్లీపై గెలుపుతో సీఎస్కేలో జోష్
ఫామ్‌లోకి వచ్చిన సంజూ శాంసన్
చెన్నై , ఏప్రిల్ 13 : ఐపీఎల్ 19వ సీజన్ మూడో వారంలోకి అడుగుపెట్టింది. అన్ని జట్లు నాలుగేసి మ్యాచ్‌లు ఆడేసాయి. ప్రతీ జట్టు కనీసం ఒక విజయాన్ని అందుకున్నప్పటకీ కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రం ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. పంజాబ్‌తో మ్యా చ్ వర్షం రద్దవడంతో పాయింట్లు పంచుకున్నా.. పేలవమైన బౌలింగ్‌తో చేజేతులా మ్యాచ్‌లు పోగొట్టుకుంటోంది.
ఇప్పుడు తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న కో ల్‌కతా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడబోతోంది. చెపాక్ స్టేడియం వేదికగా జరగబోయే ఈ మ్యాచ్‌లో సీఎస్కేనే ఫేవరెట్. ఎం దుకంటే గత మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించి పా యింట్ల ఖాతా తెరిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫామ్ అందుకుంది. బ్యాటింగ్ లో సంజూ శాంసన్ సెంచరీతో అదరగొట్టాడు. మొదట మూడు మ్యాచ్‌లలో విఫలమైన సంజూ ఢిల్లీపై మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడా డు.
తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఆయుశ్ మాత్రే, శివ మ్ దూబే కూడా దుమ్మురేపుతున్నారు. మి గిలిన బ్యాటింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్, బ్రెవిస్ కూడా రాణిస్తే చెన్నై సూపర్ కింగ్స్‌కు తిరుగుండదు. అటు బౌలింగ్‌లో జేమీ ఓవర్టన్, ఖలీల్ అహ్మద్, గుర్జపనీత్‌సింగ్ ఉండగా.. ఏకైక స్పిన్నర్ నూర్ అహ్మద్ పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ధోనీ లేకపోవడం కూ డా చెన్నైకి మైనస్‌గా మారింది.
మోకాలి గాయంతో దాదాపు 3--4 వారాలు దూరమవడంతో ఈ మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. మరో వైపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సీజన్ ఆరంభం నుంచీ ఏదీ కలిసిరావడం లేదు. కీలక ఆటగాళ్ళు గాయాలతో దూరమ వడం, జట్టులో ఉన్న ఆటగాళ్లు పేలవ ఫామ్ తో సతమతమవడం ఇబ్బందిగా మారింది. కెప్టెన్ రహానే, మరో ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా మంచి ఆరంభాన్ని ఇస్తే భారీస్కోరు ఖాయం.
అన్నింటికంటే ముఖ్యంగా కామెరూన్ గ్రీన్ ఇంకా పూర్తిస్థాయి సత్తా చూపిం చలేదు. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పై గ్రీన్ బ్యాట్ రాణించాడు. బంతితో ఒక వికె ట్ తీసినా పరుగులు మాత్రం భారీగా సమర్పించుకున్నాడు. అయితే ఫిట్‌నెస్ సాధించి బౌలింగ్ చేస్తుండడం కొంత ఊరట. మిగిలిన వారిలో రింకూ సింగ్, రఘువంశీ, రోవ్ వన్ పావెల్, రమణ్ దీప్ సింగ్‌లతో బ్యా టింగ్ అత్యంత బలంగా ఉంది.
కేవలం బౌ లింగ్ మాత్రమే బలహీనంగా కనిపిస్తోంది. సునీల్ నరైన్, నవదీప్ శైని, కార్తీక్ త్యాగి నిరాశపరుస్తున్నారు. ఈ సీజన్‌లో తొలి విజయం సాధించాలంటే కేకేఆర్ బౌలింగ్ కూడా పూర్తిగా గాడిన పడాల్సిందే.
గత రికార్డులు
ఇరు జట్లు 32 సార్లు తలపడితే చెన్నై 20 మ్యాచ్‌లలో గెలిచింది. 11 మ్యాచ్‌లలో కేకేఆర్ విజయం సాధించింది. 1 మ్యాచ్ ఫలి తం తేలలేదు.
పిచ్ రిపోర్ట్
మ్యాచ్ ఆతిథ్యమిస్తున్న చెపాక్ పిచ్ బ్యా టింగ్‌కు అనుకూలిస్తుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గుచూపొచ్చు.
తుది జట్లు అంచనా
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (కీపర్), ఆయుశ్ మాత్రే, బ్రెవిస్, సర్ఫరాజ్ ఖాన్, దూబే, ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీ ల్ అహ్మద్, గుర్జాపనీత్ సింగ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ : అలెన్, రహా నే (కెప్టెన్), గ్రీన్, రఘువంశీ, రోవ్‌మన్ పావెల్, రింకూ, రమణ్ దీప్, అంకుల్ రాయ్, సునీల్ నరైన్, నవదీప్, కార్తీక్ త్యాగి




