calender_icon.png 1 May, 2025 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి

30-04-2025 12:00:00 AM

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్

ఆదిలాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి) : దేశ వ్యాప్తంగా సాగలో ఉన్న ఆదివాసీ,  పేదలకు పోడు హక్కు పత్రాలను ఇవ్వక పొగ, అటవీ భూములను అదాని, అంబానీ వంటి కార్పోరేట్ సంస్థలకు అప్పగించడానికి సిద్ధపడుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ అన్నా రు. టైగర్ జోన్స్ పేరుతో ఆదివాసీలను అడవుల నుండి బయటకి వెళ్ళగుడుతున్నారని పేర్కొన్నారు.

మే 20న కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో సమ్మె ను జయప్రదం చేయాలని ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన సమ్మె సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో  విఫలం అయిందని అన్నారు.

రైతులు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్న హామీ హామీగానే మిగిలిందని చెప్పారు. రైతాంగ పోరాటం ఫలితంగా రద్దు చేసిన నల్ల చట్టాలను దొడ్డిదారిన అమలు చేయడానికి సిద్ధపడుతుందని ఆరోపించారు. అందులో భాగంగానే విద్యుత్ సంస్క రణల చట్టాన్ని,  మార్కెట్ ముసాయిదా సవరణ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధప డుతుందని చెప్పారు.

పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లు గా మార్చి కార్మికులను ఆధునిక కట్టు బానిసలుగా, ప్రైవేట్ కార్పొరేట్ బహుళజాతి కంపెనీ యాజమాన్యాలకు అప్పగించా లని చూస్తున్నారని పేర్కొన్నారు. సంఘాన్ని పెట్టుకోవడం హక్కుల కోసం పోరాటం చేసే అవకాశాన్ని లేకుండా చేయాలని చూస్తున్నారని, 8 గంటల పని దినం 15 గంటలకు మార్చాలని ఆలోచన చేస్తున్నదన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ నాయక్, జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రి, ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు స్వామి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నన్న తదితరులు పాల్గొన్నారు.