6 July, 2026 | 6:47 AM

సాత్విక్ జోడీకి టైటిల్

20-05-2024 02:48 AM

బ్యాంకాక్: భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ శెట్టి.. థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌నకు సన్నద్ధమవుతున్న ఈ జోడీ.. థాయ్‌లాండ్ ఓపెన్‌లో ప్రత్యర్థులకు కనీసం ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా విజేతగా నిలవడం విశేషం. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆదివారం సాత్విక్ జంట 21 21 చెన్ బో యాంగ్ యీ (చైనా) ద్వయంపై విజయం సాధించింది. 46 నిమిషాల్లో ముగిసిన పోరులో చైనా జంటపై మన షట్లర్లు పూర్తి ఆధిపత్యం కనబర్చారు.

సాత్విక్ జంటకు ఇది తొమ్మిదో బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కాగా.. తుదిపోరులో ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురకాకపోవడంతో మన షట్లర్లు సునాయాసంగా విజయం సాధించారు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన సాత్విక్ జోడీ.. రెండో సారి థాయ్‌లాండ్ ఓపెన్‌లో టైటిల్ కైవసం చేసుకుంది. ‘బ్యాంకాక్ మాకు ఎప్పుడూ ప్రత్యేకమైందే. కెరీర్‌లో తొలి (2019లో) సూపర్ సిరీస్ టైటిల్ ఇక్కడే గెలిచాం. థామస్ కప్‌లో కూడా ఇక్కడే విజయం సాధించాం. అలాంటి చోట మరో టైటిల్ నెగ్గడం ఆనందంగా ఉంది’ అని విజయం అనంతరం సాత్విక్ పేర్కొన్నారు.