13-09-2025 01:00:14 AM
50వేల రూపాయలు విరాళం
భద్రాచలం, సెప్టెంబర్ 12, (విజయక్రాంతి) భద్రాచలం జూనియర్ కళాశాల సెంటర్లో ఉన్న శ్రీ సాయి బాబా వారి ఆలయానికి 51,116/- విరాళం అందజేశారు.భద్రాచలం లో ఉంటున్న యాటకాని సత్యవతి బాబా వారికి చేయించ తలపెట్టిన స్వర్ణ సింహాసనమునకు బంగారు పూతతో విరాళంను ఆలయ కోశాధికారి గొర్ల వెంకటేశ్వరరావుకు అందించారు.అర్చకులు గోత్రనామాలతో అర్చన జరిపి ఆశీర్వచనం చేశారు.కోశాధికారి వెంకటేశ్వరరావు దాతలను శాలువాతో సత్కరించి బాబా వారి మెమెంటోను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.