13-09-2025 01:01:23 AM
* సీఐటీయూ జిల్లా నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 12, (విజయక్రాంతి)10 నెలల జీతాలు ఇవ్వలేని ప్రభుత్వానికి పాలించే అర్హత లేదనీ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవికుమార్, పట్టణ కన్వీనర్ కే సత్య అన్నారు. శుక్రవారం పాల్వంచ పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల నిరవధిక సమ్మె శిబిరాన్ని వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా దొడ్డ రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులు, ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 10 నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయాని, రూ 12.500 వస్తున్న వేతనాన్ని రూ 9,200 లకు తగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
జీవో నెంబర్ 60 ప్రకారం రూ 15,600 చెల్లించాలన్నారు. మరణించిన వారి కుటుంబంలో నుంచి ఒకరికి పని కల్పించాలనీ , పూర్తి కాలం పనిచేస్తున్న వారందరికీ పూర్తి జీతాలు చెల్లించాలనీ, పర్మినెంట్ టైం స్కేల్ చేయాలనీ , గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ గా పనిచేస్తున్న హాస్టల్స్ పాఠశాలల వర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సేవ్య, పార్వతి కుమారి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.