calender_icon.png 13 September, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినియోగం పెరిగింది.. కొరత ఏర్పడ్డది

13-09-2025 12:58:02 AM

  1. గత ఏడాది కంటే ఈ ఏడాది 34 వేల ఎకరాలే పెరిగిన పంట 
  2. నానో యూరియాతో మెరుగైన ఫలితాలు : వెంకటేష్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి 

మహబూబ్ నగర్,సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): గత ఏడాది కంటే ఈ ఏడాది కేవ లం జిల్లా వ్యాప్తంగా 34 వేల ఎకరాలు మా త్రమే అధికంగా పంటలు సాగు చేయడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. కా గా యూరియా వినియోగంలో మాత్రం రో జురోజుకు సమస్యలు జిల్లా వ్యాప్తంగా ఉత్పన్నమవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గ డం లేదు.

నానో యూరియా వినియోగిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నప్పటికీ రైతుల మాత్రం ఆ దిశగా వినియోగించడంలో ముందుకు సాగడం లే దు. ఏడాది ఏరియా సమస్య తీర విధంగా కనిపించడం లేదని రైతులు రోజురోజుకు ఆందోళన కార్యక్రమాల్ని ఉద్ధృతం చేస్తూ అందిన కాడికి తీసుకుంటూ వెళ్తున్నారు. నానో యూరియా వినియోగించాలని రైతులకు పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చేలా ప్రచా రం జరగకపోవడంతోనే ఈ సమస్య మరింత జఠిలంగా మారింది. 

- జిల్లావ్యాప్తంగా సాగైన పంటలు ఇలా..

2024 వానా కాలంలో సాగైన పంటల విస్తీర్ణం 3,31,498 ఎకరాలు,2025 వానా కాలంలో సాగైన పంటల విస్తీర్ణము 3,64, 573 ఎకరాలు2024-వానాకాలం లో వరి - 1,94,982, మొక్కజొన్న - 22,583,పత్తి - 82,482, కంది - 11,388,ఇతర పంటలు - 1, 386 కూరగాయలు & ఉద్యాన పంటలు - 17, 283పంటలు పండించడం జరిగింది.  2025-వానాకాలంలో వరి - 2,19,610, మొ క్కజొన్న - 39,469,పత్తి - 82,482,కంది - 11,388,ఇతర పంటలు - 5,486కూరగాయ లు & ఉద్యాన పంటలు - 20,283 సాగు చే యడం జరిగింది.- జిల్లాలో యూరియా సరఫరా ఇలా 2025 వానకాలంలో 38,787 మెట్రిక్ టన్నుల కు గాను ఇప్పటి వరకు 23,238 మెట్రిక్ టన్నుల యూరియా సరఫ రా కావడం జరిగింది.

2025సెప్టెంబర్ నెల లో 7700 మెట్రిక్ టన్నుల కు గాను 1500 మెట్రిక్ టన్నులు రావటం జరిగిందని, యూ రియా ర్యాక్ సరఫరా ననుసరించి డీలర్ లకు పంపిణీ చేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖ చెబుతుంది. సాధారణంగా వరి, మొక్కజొన్న పంటలలో యూరియా వినియోగం ఎక్కువ, రైతులు వరి పంటకు ఎకరాకు మూడు యూరియా బస్తాలు, మొ క్కజొన్న పంటకు ఎకరాకు మూడు నుండి నాలుగు ఏరియా బస్తాలు వినియోగిస్తారు. రైతులు ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు కూడా దాదాపు 25 వేల ఎకరాలలో ఆలస్యంగా వరి నాట్లు వేయడం జరిగింది.

ఆల స్యంగా నాట్లేసిన వరి పంటలకు యూరియా రిక్వైర్మింట్ ఎక్కువ. అననంగా యూరియా ను వేస్తేనే ఆలస్యంగా ముదురునారు వేసిన పంటలలో దిగుబడి వస్తుంది. అదనంగా పెరిగిన సాగు విస్తీర్ణం (50వేల ఎకరాలు) వల్ల యూరియా రిక్వైర్మింట్ పెరిగింది. యూ రియాకు ప్రత్న్యంయంగా నానో యూరియాను (చల్లి) పిచికారి చేసి మంచి దిగుబ డులను పొందవచ్చు. రైతులు అజార్య పడొ ద్దు వేసిన పంటలకు అనుగుణంగా యూరి యా సరఫరా చేయడం జరుగుతుంది. 

- నానో యూరియా మేలు 

నానో యూరియా ధర రూపాయలు 225/- (500ml బాటిల్) మాత్రమే, ఎకరా కు ఒక 500ml బాటిల్ సరిపోతుంది, రవా ణా ఖర్చు ఉండదు, 80% నత్రజని పంటకు అందుతుంది. దీని పనితనం పంటపై ఎనిమిది నుండి పది రోజులు ఉంటుంది. మ నం దీనిని పంటపై నేరుగా పిచికారి చేస్తాం కాబట్టి పంట యొక్క అన్ని భాగాలకు ఇది సులభంగా చేరుతుంది. సంవత్సరం వరకు దీన్ని వాడుకోవచ్చు. ఎరువుల కంపెనీలు నానో యూరియా ఉత్పత్తికి అంతరాయం కలిగే అవకాశం లేదు ఎందుకంటే దీని ఉత్పత్తిని తక్కువ ఖర్చుతో తక్కువ స్థలంలో చేసుకోవచ్చు. దీనికి రాయితీ ఏమీ లేదు కాబట్టి ప్రభుత్వంపై భారం ఉండదు తద్వా రా దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది.

- సాధారణ యూరియా పనితనం ఇలా

సాధారణ యూరియా ధర రూపాయలు 267/- (50 కేజీల బస్తా), ఎకరాకు రెండు నుండి నాలుగు బస్తాల వరకు అవసరం అవుతుంది. రవాణా ఖర్చు అదనం. 35% నత్రజని మాత్రమే పంటకు అందుతుంది, మిగతా నత్రజని ఆవిరై పోతుంది. దీని పనితనం పంటపై రెండు నుండి మూడు రో జుల మాత్రమే ఉంటుంది. వేర్ల నుండి ఆకులకు పంటపై భాగాలకు నత్రజని తక్కువగా చేరుతుంది మరియు చేరడానికి సమయం పడుతుంది.

రెండు నుండి మూడు నెలల తర్వాత గడ్డకట్టే అవకాశం ఉంది. ఎరువుల కంపెనీలు యూరియా ఉత్పత్తికి అంతరాయం కలిగితే కొరత ఏర్పడుతుంది. ఎం దుకంటే దీని ఉత్పత్తికి భారీ కర్మగారాలు అవసరమవుతాయి. ప్రభుత్వం ప్రతి యూ రియా బస్తా పై రూపాయలు 1970/- కంపెనీలకు రాయితీ రూపంలో చెల్లిస్తుంది తద్వా రా వీటి భారం ప్రజలపై పడుతుంది.

 నానో యూరియా వాడండి...

2024 వానాకాలం సాగుతో పోల్చినట్లయితే దాదాపు 34 వేల ఎకరాల సాగు ఈ 2025 వానా కాలంలో పెరిగింది. తద్వారా యూరియా రిక్వైర్మింట్ పెరిగింది.2024 వానాకాలం లో సీజన్ చివరి వరకు అక్టోబర్ 2024 వరకు 23,984 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం జరిగింది. 2025 వానకాలంలో ఈ రోజు వరకు 23,238 మెట్రిక్ టన్నులయూరియా పంపిణీ చేయడం జరిగింది. నానో యూరియా వినియోగించడం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. 

  వెంకటేష్, 

జిల్లా వ్యవసాయ అధికారి