26 August, 2026 | 8:22 AM

నేడే చంద్రబాబు ప్రమాణం

12-06-2024 12:33 AM

ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా ‘నారా’ ఎంపిక

విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల భేటీలో ఖరారు

రాష్ట్ర అభివృద్ధికి సమిష్టిగా పనిచేద్దామని బాబు పిలుపు

జనసేన ఎల్‌పీ నేతగా పవన్‌కల్యాణ్ ఎంపిక

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి) : ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.27 గంటలకు ఆయన ప్రమాణానికి ముహూ ర్తం నిర్ణయించారు.  కేసరపల్లి ఐటి పార్క్ వద్ద ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదిలా ఉండగా, ఎన్డీయే కూటమి శాసనసభా పక్షనేతగా చంద్రబాబు మంగళవారం ఎన్నికయ్యారు.

టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలతో విజయవాడలో సమావేశం నిర్వహించారు.  మూడు పార్టీల ఎమ్మెల్యేలు చంద్రబాబును ప్రభుత్వ నేతగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మా ట్లాడుతూ ఎన్టీయే శాసనభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడు కోవడానికి ప్రజలు చొరవ చూపారని, ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నూటికి నూరు శాతం 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పని చేశారని, ఎన్నికల్లో 93 శాతం సీట్లు రావడం దేశ చరిత్రలో అరుదని పేర్కొన్నారు.

ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారని, ప్ర జల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగిందన్నారు.  జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందగా, బీజేపీ10 స్థానాలకు 8 సీట్లు గెలుచుకుందని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చినతీర్పు వల్ల  ఢిల్లీలో అందరూ గౌరవించారని, రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందని చెప్పారు.  పవన్ కళ్యాణ్ స్ఫూర్తిని ఎప్పటికీ మరిచిపోలేను.. నేను జైల్లో ఉన్నప్పడు ఆయన పరామర్శించారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకున్నాం. ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి పని చేద్దామని, మీ అందరి సహకారంతో బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని పేర్కొన్నారు.

కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్డీయే నేతలు హాజరవుతున్నారు. సమిష్టిగా ప్రజ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్న చంద్రబాబు.. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహ కారం అవసరం అన్నారు.  కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రానికి సముచిత గౌరవం దక్కిందన్న చంద్రబాబు ముగ్గురు ఎంపీల, కేంద్రం లో మంత్రులుగా ఉండే అవకాశం వచ్చిందన్నారు. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ,శ్రీనివాస్ వర్మకు క్యాబినెట్‌లో చోటు కల్పించారన్నారు.  

జనసేన ఎల్పీ నేతగా పవన్  

జనసేన శాసన సభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎంపికయ్యారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ పేరును ఎమ్మెల్యే నాదేండ్ల మనోహర్ ప్రతిపాదించారు. మిగతా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. అలా గే బీజేపీ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల భేటీలో పురంధేశ్వరిని ఎల్‌పీ నేతగా ఎన్నుకున్నారు.  

మంత్రి వర్గ ఏర్పాటుపై బాబు కసరత్తు

బుధవారం చంద్రబాబుతో పాటు కూటమి నుంచి పలువురు ఎమ్మెల్యేలు మం త్రులుగా ప్రమాణం చేయనున్నారు. అయితే  కేబినెట్‌లో స్థానం దక్కించుకునేదెవరనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చజరుగుతోంది. టీడీపీ నుంచి 20, 21 మంది ఎమ్మెల్యేలకు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.  ఈ విషయమై చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణ యానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే నారా లోకేష్ అండ్ టీమ్ ఇప్పటికే 50 మం ది పేర్లతో జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. జనసేనకు 3 లేదా 4 మంత్రి పద వులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు నాదేండ్ల మనోహర్‌కు చాన్స్ ఉంటుందని చర్చ జరుగుతోంది. బీజేపీ నుంచి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకూమార్, విజయవాడ తూర్పు ఎమ్మె ల్యే సుజనా చౌదరికి మంత్రి పదవులు రావచ్చని చర్చించుకుంటున్నారు. మొత్తంగా చం ద్రబాబు బీసీలకు పెద్ద పీట వేయనున్నారు. 8 నుంచి 9 మంది బీసీ ఎమ్మెల్యేలకు చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కమ్మ,కాపు సామాజిక వర్గాలకు చెరో 4, రెడ్డి సామాజిక వర్గానికి మూడు,ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి ఇద్దరికి,మైనార్టీ నుంచి ఇద్దరికి మంత్రిపదవులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

గన్నవరం విమానాశ్రయంలో ట్రాఫిక్ ఆంక్షలు

చంద్రబాబు  ప్రమాణస్వీకార కార్యక్రమం నేపథ్యంలో గన్నవరం విమా నాశ్రయ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం విమాన ప్రయాణికులు ఉదయం 9.30 గంటల కల్లా చేరుకోవాలని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంత రెడ్డి సూచించారు. ప్రయాణికుల విమనాలేవీ రద్దు చేయలేదని, అన్ని  యథాతథంగా నడుస్తాయని తెలిపారు. విజయ వాడ నుంచి హైదరాబాద్, బెంగుళూరు, తిరుపతి, షిర్టీ వెళ్ళే  విమనాలు యధావిధిగా బయల్దేరుతాయని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విమానశ్రయం పరిసరాల్లో ఆంక్షలు ఉంటాయన్నారు. 

సీఎంగా చంద్రబాబు 

ప్రమాణ స్వీకారోత్సవానికి బండి సంజయ్

కరీంనగర్, జూన్ 11 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ హాజరుకానున్నారు. మంగళవారం రాత్రే ఆయన విజయవాడకు చేరుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.