జనవరి 6న ముహూర్తం
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా రూపొందిస్తున్న నాలుగు చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. ‘హౌస్‌ఫుల్ 5, సికిందర్, బాఘీ 4తో పాటు షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మరో చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. షాహిద్ కపూర్, ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ కాంబోలో సుదీర్ఘ విరామం తర్వాత ఓ చిత్రం రానుంది.
నడియావాలా తన సొంత బ్యానర్ గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రంలో త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తోంది. అమ్మడికి ‘యానిమల్’ చిత్రం బాగా కలిసొచ్చింది. అప్పటి నుంచి వరుసగా అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం అవకాశం కూడా త్రిప్తినే వరించింది. ఈ చిత్రంలో ‘నానా పటేకర్, రణదీప్ హుడా వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 2025 జనవరి 6న ప్రారంభం కానుంది. 2025 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రా నుంది.






