23-01-2026 12:06:40 AM
న్యూఢిల్లీ, జనవరి 22: మధ్యప్రదేశ్‌ని గిరిజన ప్రాబల్య ధార్ జిల్లాలోని వివాదాస్పద భోజ్‌శాలలో శుక్రవారం సరస్వతీ పూజ, న మాజ్ రెండూ జరుపుకోవచ్చని సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ నెల 23న(శుక్రవారం) ధార్‌లో భోజ్‌శాల సముదాయంలో మతపరమైన కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని ఇరువర్గాల(హిందూ ముస్లింలు)కూ సుప్రీంకోర్టు అనుమతులు జారీచేసింది. ఇందుకోసం వేర్వేరు సమయా లు, స్థలాలు, ప్రవేశ- ద్వారాలను ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా స్థా నిక యంత్రాంగానికి సహకరించాలని ఇరువర్గాలకూ సూచించింది. భోజ్‌శాల ప్రాం తంలో శుక్రవారం హిందూ, ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించిం ది. వసంత పంచమి సందర్భంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పూ జలు చేసుకునేందుకు హిందు మతం వారికి అనుమతి ఇచ్చింది. ముస్లింలు ‘మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య నమాజ్ కోసం అదే ప్రాంగణంలో ప్రత్యేకమైన, వేరే ప్రదేశాన్ని, అలాగే అదే ప్రాంగణంలోకి ప్రవేశిం చడానికి, బయటకు వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలను అందుబాటులో ఉంచాలని సూ చించింది.
అలాగే వసంత పంచమి సందర్భంగా సాంప్రదాయ వేడుకలను నిర్వ హిం చేందుకు హిందూ సమాజానికి కూడా ఒక ప్రత్యేక స్థలాన్ని అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు పేర్కొంది. శాంతిభద్రతలకు వి ఘాతం కలగకుండా ఇరువర్గాలు స్థానిక యంత్రాంగంతో సహకరించాలని సూచించింది.
భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ)తో రక్షించబడిన 11వ శతాబ్దపు స్మారక చిహ్నమైన భోజ్‌శాల సముదాయం చాలా కాలం గా మతపరమైన వివాదానికి కేంద్రంగా ఉం ది. హిందువులు దీనిని సరస్వతీ దేవికి అం కితం చేయబడిన ఆలయంగా భావిస్తుండ గా, ముస్లింలు దీనిని కమల్ మౌలా మ సీదుగా పేర్కొంటున్నారు. జనవరి 23 (వసం తపంచమి, శుక్రవారం)న భోజ్‌శాల కాం ప్లెక్స్‌లో మతపరమైనవి నిర్వహించుకు నేం దుకు అనుమతి ఇవ్వాలని ఇరువర్గాలు కోరిన నేపథ్యంలో ఈ తీర్పు వచ్చింది.