calender_icon.png 23 January, 2026 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజా శాంతి మండలి ప్రారంభం

23-01-2026 12:00:00 AM

  1. దావోస్ వేదికగా ట్రంప్ అధికారిక ప్రకటన 
  2. కార్యక్రమానికి భారత్ గైర్హాజరు
  3. పాక్ సహా పలు దేశాలు సంతకాలు 
  4. మండలిలో చేరబోమన్న ఫ్రాన్స్, స్వీడన్, నార్వే

దావోస్, జనవరి 22: గాజా శాంతి మం డలిని (బోర్డ్ ఆఫ్ పీస్) ప్రారంభిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ప్రకటన చేశారు. దావోస్ వేదికగా జరు గుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ‘బోర్డ్ ఆఫ్ పీస్’కు సంబంధించిన పత్రాలను ట్రం ప్ ఆవిష్కరించారు. గాజా శాంతి మండలికి సంబంధించి ట్రంప్ ఆధ్వర్యంలో పలు దేశా ల నేతలు సంతకాలు చేశారు. వారిలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీప్ కూడా ఉన్నా రు.

గాజా శాంతి మండలి సభ్య దేశాలుగా సంతకం చేసిన జాబితాలో పాకిస్థాన్, బహ్రెయిన్, మొరాకో, అర్జెంటీనా, ఆర్మేనియా, అజర్‌బైజాన్, బల్గేరియా, హంగేరి, ఇండోనేషియా, జోర్డాన్, కజకిస్థాన్, కొసావో, పరా గ్వే, ఖతార్, సౌదీ అరేబియా, టర్కీ, యూ ఏఈ, ఉజ్బెకిస్థాన్, మంగోలియా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి భారత్ దూరంగా ఉంది.

ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి మండలిలో చేరాలా? వద్దా? అనే దానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడంతోనే కార్యక్రమానికి భారత్ గైర్హాజరైనట్లు తెలుస్తోంది.  అయి తే గాజా ‘బోర్డ్ ఆఫ్ పీస్’కు ట్రంప్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే రష్యా, ఇజ్రాయెల్, బెలారస్ దేశాలు ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరేందుకు అంగీకరించాయి.

ఎందుకీ ‘బోర్డ్ ఆఫ్ పీస్’?

వాస్తవానికి గాజా ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ట్రంప్‌కు గతేడాదే పుట్టింది. గత సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ట్రంప్ 20 సుత్రాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గాజా నుంచి మిలిటరీని వెనక్కి పంపేందుకు, ఆ పట్టణాన్ని మళ్లీ పునర్‌నిర్మించేందుకు ‘బోర్డ్ ఆఫ్ పీస్’ అవసరమని ట్రంప్ భావించారు. ఈ నేపథ్యంలోనే 20 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగానే ‘బోర్డ్ ఆఫ్ పీస్’ను ఏర్పాటు చేశారు.

గాజా శాంతి మండలిలో చేరాలంటూ భారత్ సహా 50 దేశాలకు పైగా దేశాధినేతలకు ట్రంప్ ఆహ్వానాలు పంపిన సంగతి తెలిసిందే.  కొన్ని షరతులతో గాజా శాంతి మండలిలో చేరేందుకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ అంగీకరించారు. అయితే ఇజ్రాయెల్, రష్యా దేశాలు ట్రంప్ ప్రతిపాదనకు ఒకే చెబుతూ ఇప్పటికే సంతకాలు చేశాయి.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక అడుగు ముందుకేసి గాజాలో శాంతి పునర్నిర్మాణం కోసం తమ మద్దతు ఉంటుందని, అందుకు ఒక బిలియన్ డాలర్ల ఫీజు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.  ఇక బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరడం లేదని ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, స్లోవేనియా ఇప్పటికే స్పష్టం చేశాయి. భారత్‌కు ఆహ్వానం అందినప్పటికీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. బ్రిటన్, చైనా, జర్మనీ, ఉక్రెయిన్, ఇటలీ వంటి దేశాలు వేచి చూసి ధోరణిని అవలంభిస్తున్నాయి. 

హమాస్‌కు హెచ్చరిక

గాజా శాంతి మండలి ఏర్పాటు నేపథ్యంలో ట్రంప్ మిలిటెంట్ గ్రూప్ హమా స్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. హమాస్ ఆయుధాలు వీడేందుకు అంగీకరించకపోతే అది వారి అస్తిత్వానికే నష్టమని ట్రంప్ పేర్కొన్నారు.