22 August, 2026 | 3:00 AM

స్పిన్ పిచ్‌పై యూటర్న్

22-08-2026 12:22 AM

కొలంబో టెస్టుకు సమతూకమైన పిచ్

గాలేలో ఓటమితో లంక బోర్డు నిర్ణయం 

బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుకూలించేలా పిచ్

భారత్‌ను స్పిన్‌తో దెబ్బ తీసి పైచేయి సాధించాలనుకున్న శ్రీలంక వ్యూహం బెడిసికొట్టి చివరికి వారికే ఓటమిని తెచ్చింది. దీంతో రెండో టెస్ట్ కోసం పిచ్ రూపకల్పనపై లంక క్రికెట్ బోర్డు ఆచితూచీ వ్యవహరిస్తోంది. మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా బాలెన్స్‌గా ఉండే పిచ్‌ను సిద్ధం చేస్తోంది.

కొలంబో, ఆగస్టు 21: భారత్, శ్రీలంక రెండో టెస్టుకు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. తొలి టెస్టులో టీమిండియా ఘన విజ యం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇపుడు క్లీన్ స్వీప్‌పై కన్నేసిన భారత్ ను అడ్డుకోవాలని లంక పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో కొలంబో పిచ్ పైనే అందరి చూపు ఉంది.

కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగే రెండో టెస్టుకు బ్యాలెన్స్‌డ్ ట్రాక్ సిద్ధం చేస్తున్నట్టు  సమాచారం. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత స్పిన్నర్ల ధాటికి శ్రీలంక బ్యాటింగ్ లైనప్ ఘోరంగా కుప్పకూలింది. ఈ నేపథ్యంలో కొలంబోలో మరీ విపరీతమైన స్పిన్ లేదా ర్యాంక్ టర్నర్ పిచ్ తయారు చేస్తే అది తిరగబడి భారత్‌కే అదనపు లాభం చేకూరుస్తుందని శ్రీలంక క్రికెట్ బోర్డ్  భావిస్తోంది. అందువల్ల, ఇరు జట్లకు సమాన అవకాశాలు ఇచ్చేలా ఈ వికెట్‌ను రూపొందిస్తున్నారు.

శ్రీలంక జట్టులో సీనియర్ ఆట గాళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల, యువ బ్యాటర్లకు సహజమైన పరిస్థితులు కల్పించేలా దీన్ని సిద్ధం చేస్తున్నారు. భారత బ్యాటర్లను స్పిన్‌తో ఇబ్బంది పెట్టడానికి శ్రీలంక పూర్తిగా స్పిన్‌కు అనుకూలించే ‘డస్ట్ బౌల్’ పిచ్‌ను తయా రు చేయడం లేదు. ఎందుకంటే దినేష్ చండీమల్, కుసాల్ మెం డిస్, పతుమ్ నిస్సంక వంటి సీనియర్ ఆటగాళ్లు గాయాల వల్ల లంక జట్టుకు దూరం కావడంతో, తమ యువ బ్యాటర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు  ఈ నిర్ణయం తీసుకుంది.

తమ యువ బ్యాటర్లపై విపరీతమైన స్పిన్ భారం పడకుండా, వారు స్వేచ్ఛగా ఆడి నిల దొక్కుకునేలా చేయడానికే శ్రీలంక బోర్డు ఈ తరహా బ్యాలెన్స్‌డ్ వికె ట్‌ను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. మ్యాచ్ తొలి రెండు రోజులు పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా సహకరించే అవకాశం ఉంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న జట్లు భారీ స్కోరు సాధించేందుకు అవకాశం ఉంటుంది. మొదట బ్యా టింగ్ ఎంచుకున్న జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే టీమిండియా కోచ్ గౌతమ్ గం భీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ పిచ్‌ను నిశితంగా పరిశీలించారు. పరిస్థితులకు తగ్గట్టుగా కుల్దీ ప్ స్థానంలో దేశవాళీ ఆల్‌రౌండర్ సారాంశ  జైన్‌ను తుది జట్టులోకి తీసుకునే యోచనలో భారత్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, బ్యాటర్లు ఓపికగా ఆడితే భారీ స్కోర్లు సాధించవచ్చు, అదే సమయం లో క్రమశిక్షణతో బౌలింగ్ చేసే బౌలర్లకు కూడా ఈ పిచ్ నుండి మంచి సహకారం లభిస్తుంది. 1999 నుంచి 2009 మధ్య కా లంలో ఈ వేదికపై శ్రీలంక ఆడిన 12 టెస్టు ల్లో ఆరు విజయాలు సాధించి మిగిలినవి డ్రా చేసుకుంది.