నేడు మహా శతావధాన్
టీఎస్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో కార్యక్రమం
ముషీరాబాద్,ఏప్రిల్ 4(విజయక్రాంతి): యువతకు ప్రేరణ కలిగించేందుకు యువ జైన మునులచే ’మహా శతావధాన్’ కార్యక్రమం ఈనెల 5న బాగ్ లింగంపల్లి, టీఎస్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు జైన్ ఇంటర్నేషనల్ విద్యాపీఠ్ ట్రస్టీ యోగేష్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు శనివారం బషీర్‌లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉదయం 8 నుండి సాయంత్రం వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో అవధానంలో ప్రావీ ణ్యం సంపాదించిన యువ జైన మునులు నేమిచంద్రసాగర్ జీ, సుపార్శ్వ చంద్రసాగర్ జి తమ జ్ఞాపక శక్తితో 200 ప్రశ్నలకు తడుముకోకుండా బదులిస్తారని తెలిపారు. భక్తు లకు ఉచిత ప్రవేశం కల్పించామని, అభినందన్ చంద్రసాగర్ జీ, జైన్ ఇంటర్నేషనల్ విద్యాపీఠ్ ట్రస్టీలు కైలాష్ బండారి, సీ.ఏ. విక్రమ్ శ్రీశ్రీమల్, అమిత్ వజవత్, హితేష్ జి ముథ, అంకిత్ చోరాదియా, ఆకాష్ గురూజీ, అక్షత్ జైనం, రిషబ్, అక్షిత్, ఆర్యన్ జైనం, ప్రానం పాల్గొన్నారు.




