5 April, 2026 | 4:20 AM

8న బీసీ కాంట్రాక్టర్ల ధర్నా

05-04-2026 12:26 AM

మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): ఈ నెల 8న బీసీ కాంట్రాక్టర్ల ధర్నాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. ధర్నా చౌక్‌లో జరగబోయే ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు కలిసి, తమకు జరుగు తున్న అన్యాయాన్ని వివరిస్తూ తమకు మద్దతుగా నిలవాలని కోరారు. బీసీ కాంట్రా క్టర్లకు జరుగుతున్న అన్యాయం పట్ల ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న స్పందించారు.

రాష్ట్రవ్యాప్తంగా బీసీ కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవడం వల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్‌దీతిజిజిలో ఉంచడం అనేది కాం ట్రాక్టర్లను ఆర్థికంగా కుదేలు చేసే చర్య అని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

బీసీ కాంట్రాక్టర్లకు తక్షణమే పెండిం గ్ బిల్లులు విడుదల చేయాలని, వారికి రావాల్సిన వాటాను న్యాయంగా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల హక్కుల కోసం ఎప్పటికప్పుడు పోరాటం కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.