రేపు ముక్కోటిపై ప్రత్యేక సమావేశం
09-12-2024 11:42 PM
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో వచ్చే సంవత్సరం జనవరి 9, 10వ తేదీలలో జరిగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు కల్పించవలసిన వసతి సౌకర్యాలపై ముందస్తు ఏర్పాట్లపై మంగళవారం ఉదయం 11:30 గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనంనకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు కల్పించవలసిన వసతి సౌకర్యాలపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయి నివేదికలతో సకాలంలో హాజరు కావాలని ఆయన అన్నారు.






