మోడ్రన్ కామారెడ్డి రైల్వేస్టేషన్
- ‘అమృత్ భారత్’ కింద ఆధునీకరణ
- రూ.39.84 కోట్లతో చురుకుగా పనులు
కామారెడ్డి, డిసెంబర్ ౯ (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్(ఏబీఎస్‌ఎస్) కింద 40 రైల్వేస్టేషన్‌లను ఆధునీకరించేందుకు రూ.2,737 మంజూరు చేసింది. ప్రధాని నరేంద్రమోడీ 2023 ఆగస్టులో రాష్ట్రంలోని రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులకు పర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు.
ఇందులో కామారెడ్డి రైల్వేస్టేషన్‌కు రూ.39.84 కోట్లు మంజూరవగా పనులు చురుకుగా సాగుతున్నాయి. జంట నగరాల్లో ఇప్ప టికే ఉన్న ఇతర రైలు టెర్మినళ్లలో రద్దీని తగ్గించడానికి, చర్లపల్లి స్టేషన్‌ను అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేశారు.
ప్రతిపాదిత పనులు
సుమారు 360 చ.మీ. విస్తీర్ణంతో స్టేషన్ భవనాన్ని అభివృద్ధి చేయనున్నారు. సుమా రు 2,450 చ.మీ.లు స్టేషన్ ప్రాంగణంతోపాటు మొదటి ప్రవేశద్వారం రూపురేఖలు మార్చనున్నారు. రెండో ప్రవేశద్వారం ఏర్పాటుతోపాటు ఇప్పటికే ఉన్న షెడ్‌ను బుకింగ్ కార్యాలయంగా మారుస్తారు. ట్రాక్ మిషన్ విశ్రాంతి గదిని జీఆర్‌పీ కార్యాలయంగా మార్చే పనులు పురో గతిలో ఉన్నాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం 3 లిప్ట్‌లు, 2 ఎస్కలేటర్ల ఏర్పాటు, 12 మీటర్ల వెడల్పుతో పాదచారుల వంతెన నిర్మాణం జరగనుంది. ప్లాట్‌ఫారమ్ ఉపరితల మెరుగుదల, అదనపు కప్పు ఏర్పాట్లు చేపట్టాల్సి ఉన్నది. దివ్యాంగులకు సౌకర్యాలతో సహా టాయిలెట్ల ఏర్పాటు, స్టేషన్ ప్రాంగణంలో కళలు, సం స్కృతి ఉట్టిపడేలా చిత్రాలను ప్రదర్శించనున్నారు. అయితే ఇప్పటికే వీఐపీ లాంజ్ అభివృద్ధి పనులు పూర్తికాగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో పనులు పూర్తి చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు.






