100 టన్నుల చికెన్ వ్యర్థాలు స్వాధీనం
శేరిలింగంపల్లి,ఆగస్టు 24 (విజయక్రాంతి): నగరంలోని కోళ్ల దుకాణాలు,మాంసం ప్రాసెసింగ్ కేంద్రాల నుంచి సేకరించిన చికెన్ వ్యర్థాలను ఆంధ్రప్రదేశ్లోని చేపల చెరువులకు అక్రమంగా తరలిస్తున్న నెట్‌వర్క్‌పై సైబరాబాద్ పోలీసులు, పశువైద్య శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో దాదాపు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు.అత్తాపూర్, మియాపూర్, అమీన్పూర్, కూకట్పల్లి, జీడిమెట్ల, చింతల్ తదితర ప్రాంతాల్లో లారీలు, నిల్వ కేంద్రాలపై తనిఖీలు జరిపిన అధికారులు భారీ మొత్తంలో వ్యర్థాలను పట్టుకున్నారు.హైదరాబాద్‌లోని పలు కోళ్ల షాపులు, ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి వెలువడే చికెన్ వ్యర్థాలను సేకరించి లారీల్లో నింపి ఏపీకి తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్కడ చేపల చెరువు యజమానులకు మేతగా విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు.






