18 June, 2026 | 4:47 PM

Breaking News

గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •   తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...   •   నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు   •   ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి   •   బాసర ఐఐటీ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం   •   బిజినేపల్లిలో సారా తయారీదారులపై బైండోవర్ కేసులు   •   సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే   •   ప్రభుత్వ పాఠశాలలో చదివితే బంగారు భవిష్యత్తు   •   ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్   •   రైతులకు సర్కార్ శుభవార్త..! 30న 'రైతు భరోసా' నిధులు విడుదల   •  

తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...

18-06-2026 03:46 PM

బాన్సువాడ, జూన్ 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఈ. నివేదిత తన తండ్రి ఇమ్మడి ప్రభాకర్ జ్ఞాపకార్థం తన తల్లి ఇమ్మడి ధనలక్ష్మితో కలసి తాను విధులు నిర్వహిస్తున్న పాఠశాలల్లోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు120 స్టీల్ కూల్ వాటర్ బాటిల్ లను అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు. తాను ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించానని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసు కాబట్టి అలాంటి ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కోవద్దని ఈ బాటిల్లను అందజేసినట్లు ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యార్థులకు మరింత సేవలు అందజేస్తానని ఆమె అన్నారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వారికి అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.