12-05-2025 02:19:30 AM
మూసాపేట మే 11 : మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో కురువ, గొల్ల కులదైవమైన నూతనంగా నిర్మించిన బీరప్ప పండుగ ఉత్సవాలలో దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో బీరప్ప దేవున్ని దర్శించుకుని పూల గంపలో పూలు వేసి పండుగ ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కి పోల్కంపల్లి గ్రామ కురువగొల్ల సంఘం సభ్యులు గ్రామస్తులు గొంగడి తో సన్మానించి గొర్రె పిల్లని బహుకరించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర యూత్ అధ్యక్షులు లక్ష్మి కాంత్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శెట్టి శేఖర్, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, మాజీ జెడ్పిటిసి రామన్ గౌడ్, పోల్కంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ యాదయ్య, పల్లి రాములు, గ్రామ అధ్యక్షులు మహేష్, కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.