25 April, 2026 | 10:12 PM

వడ దెబ్బకు ట్రాక్టర్ డ్రైవర్ మృతి

25-04-2026 08:43 PM

బెల్లంపల్లి, (విజయ క్రాంతి): తాండూర్ మండలం బారేపల్లి గ్రామానికి చెందిన కోట్రంగి జయరాం (40) ట్రాక్టర్ డ్రైవర్ వడదెబ్బ తో మృతి చెందాడు. తాండూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. జయరాం శుక్రవారం పని నిమిత్తం బెల్లంపల్లికి వెళ్లాడు. ఇంటికి సాయంత్రం చేరుకున్నాడు. ఇంటికి వచ్చిన ఆయన   వాంతులు, విరేచనాలు  చేసుకున్నాడు.  రాత్రి 1100 గంటలకు కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ఆసుపత్రికి తీసుకువెళ్ళారు.  వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. మంచిర్యాల కు వెళ్తుండగా మార్గమధ్యంలో జయరాం  మృతిచెందాడు. వడదెబ్బ వల్లనే తన భర్త  మృతి చెందిన నట్టు భార్య  నిలబాయి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని తాండూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.