20 April, 2026 | 1:39 AM

గ్రీన్ ఫీల్డ్ హైవేపై అదుపుతప్పిన ట్రాక్టర్

20-04-2026 12:00 AM

కేసముద్రం, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిధిలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్ హైవే పనుల్లో సిమెంటు బిల్లలతో వెళ్తున్న ట్రాక్టర్ ఆదివారం తప్పి పడిపోయింది. అయితే ఈ సంఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ సమయస్ఫూర్తితో ముందుగానే దూకడంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. ట్రాక్టర్ వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కనే మక్కా జొన్నలు శుభ్రం చేస్తున్న యంత్రం నుంచి దూళి డ్రైవర్ కంట్లో పడడంతో ట్రాక్టర్ తప్పి రోడ్డుపై కిందకు పడిపోయిందని చెబుతున్నారు.