17 July, 2026 | 2:13 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి...

24-03-2025 03:29 PM

ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మునుగోడు సత్య ఫంక్షన్ హాల్ లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం మునుగోడు మండల 11 మహాసభకు హాజరై మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డు నేటికీ సమస్యల నిలయముగా మారిందని ఆరోపించారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటియుసి నిరంతరం అండగా నిలిచి పోరాడుతుందని అన్నారు. గత కొన్ని నెలలుగా కార్మికులకు డబ్బులు ఇవ్వడం లేదని ఆన్లైన్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పరిష్కరించడంలో లేబర్ డిపార్ట్మెంట్ వైఫల్యం చెందిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలు వలన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కార్మిక వ్యతిరేక విధాలు తిప్పికొట్టేందుకు పోరాటాలు తీవ్రతరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహాసభ లో ఏ టి యు సి గౌరవాధ్యక్షులు చాపల శ్రీను,మండల కార్యదర్శి దుబ్బ  వెంకన్న, కార్యదర్శి బెల్లం శివయ్య , ఈధ యాదయ్య, పందుల పెద నరసింహ, మేకల కృష్ణయ్య ఇదే రాములు, శీను పందుల మారయ్య,ఏరుకొండ నాగేష్, యాసరాని ఎంకన్న, దొమ్మాటి గిరి, భీమనపల్లి స్వామి ,బండారి శంకర్మాల్యాద్రి, చిన్న నర్సిహ్మా ఉన్నారు.