13 April, 2026 | 12:38 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

గజ్వేల్ 11వ వార్డులో కారు జోరు

06-02-2026 01:32 AM

ప్రచారంలో ముందంజలో ఉన్న బీఆర్‌ఎస్ అభ్యర్థి భవానీ కరుణాకర్ 

గజ్వేల్, ఫిబ్రవరి 5(విజయక్రాంతి): గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు లక్ష్మాపూర్, బ్రాహ్మణ బంజరుపల్లి, సంగాపూర్ గ్రామాల్లో  బీఆర్‌ఎస్ అభ్యర్థి కొలిచెలిమె భవాని కరుణాకర్ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. గురువారం సంగాపూర్ లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిం చారు. వార్డు ఇన్‌చార్జి ర్యాగల్ల దుర్గయ్య ఆధ్వర్యంలో ప్రచారంలోజోరు పెంచారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి తిరుగుతున్న సమయంలో ఓటర్ల నుంచి చక్కని స్పందన లభిస్తుందన్నారు.

వార్డు సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించాలని ప్రజలను కోరారు. ప్రజల నమ్మ కాన్ని నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని కౌన్సిలర్ అభ్యర్థి భవాని కరుణాకర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొలిచేలిమే స్వామి, మల్లేశం, పుంటి కూర రమేష్, మల్లేష్, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.