06-02-2026 01:30:35 AM
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 12వ వార్డు బీజేపీ అభ్యర్థి దయాకర్ రెడ్డి
గజ్వేల్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మల్లన్నసాగర్ పునరావాసంలో ప్యాకేజీల పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దామరంచ దయాకర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో ఇం టింటి ప్రచారంలో భాగంగా కులవృత్తిదారులతో ఆయన మాట్లాడారు.
బీఆర్‌ఎస్ ప్రభు త్వం మల్లన్న సాగర్ పేరుతో అవసరానికి మించి ప్రజల నుంచి భూములు లాక్కొని, పరిహారం అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణితో ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఎంపీ రఘు నందన్ రావు సహకారంతో అభివృద్ధి చేస్తానని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ కరుణాకర్, ప్రభాకర్, రవీందర్ పాల్గొన్నారు.