06-02-2026 01:32:31 AM
ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి
హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఓరుగల్లు వైభవాన్ని, శివతత్వా న్ని చాటే విధంగా ప్రతి ఏటా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ హయాగ్రీ వాచారి గ్రౌండ్ లో నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఆధ్యాత్మిక, సంస్కృతిక సమ్మేళనం కా ర్యక్రమానికి సంబంధించిన కరపత్రికను గు రువారం కాకతీయ హరిత హోటల్లో ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి, శ్రీ భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ శేషు, విశ్వహిందూ పరిషత్ వరంగల్ జి ల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొని, ఆవిష్కరించారు.
అనం తరం వారు మాట్లాడుతూ ఓరుగల్లు ఒక ఆధ్యాత్మిక, సంస్కృతిక కేంద్రం, ఎన్నో కలలకు పుట్టినిల్లు, దాశరధి, కాళోజి లాంటి కవులు ఎందరో పుట్టిన నేల ఇది అని, 400 ఏళ్లపాటు కాకతీయ రాజధానిగా విలసిల్లిన శివతత్వకేంద్రం ఓరుగల్లు నగరమనీ అన్నా రు. ఈ ప్రాంత విశిష్టతను చాటి చెప్పడం కోసమే ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక సంస్కృతి సమ్మేళనం గత 6 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని తెలి పారు.
ప్రతి ఏడాదిలాగే ఆధ్యాత్మిక, సాం స్కృతిక, కళారూపాలతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఓరుగ ల్లు నగరంలో పంచాత్మక లింగాలు ఉన్నాయని, ఈ విశిష్టత దేశంలోనే ఒక ఓరుగ ల్లుకు మాత్రమే ప్రత్యేకత ఉన్నదని తెలిపారు. ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డలో ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. భారతదేశం సనాతన ధర్మానికి పుట్టినిల్లు, అందు లో మన ఓరుగల్లు శివరత్వానికి, ఆధ్యాత్మికతకు పేరుగాంచిందని తెలిపారు. ఈనెల 15 నా శివపార్వతి కళ్యాణంతో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని అన్నారు.
ఈ అపురూప కార్యక్ర మాలను జిల్లా వ్యాప్తంగా వేలాది మంది భక్తులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాధా మనోహర్ దాస్, పద్మశ్రీ కిన్నెర మొగిల య్య, దేశపతి శ్రీనివాస్, ఆర్పి పట్నాయక్, శశిధర, నల్గొండ గద్దర్, కాసర్ల శ్యామ్, గో దారి శ్రీనివాస్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రతి ఏడాది లాగే ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కళా, సేవా, పర్యావరణ, తదితర రంగాల్లో నిస్వార్థ సేవలు అందించిన ఉత్తములకు కాకతీయ పురస్కారం ప్రధానం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఎలగందుల రాజు, కార్పొరేటర్ రవి నాయక్, ప్రముఖ యోగా గురువు పో శాల శ్రీనివాస్, ఇండస్ ఫౌండేషన్ కార్యదర్శి పురుషోత్తం యాదవ్, నిర్వాహకులు కత్తుల అభిషేక్, సుఖాంత్, దీపక్, అఖిల్ రెడ్డి, స ర్పంచులు గడ్డం రఘు వంశీ, కృష్ణమూర్తి, సభ్యులు కొమురయ్య, కొడాలి రవి, సుమ న్, గువ్వ రాజేష్, రవీందర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, వంశీ, రాజేష్, రాజేందర్, పిన్నింటి విజయ్ కుమార్, వైనాల నరేష్, బోడ విజయ్, లక్ష్మణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.